ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'క్లైమాక్స్' రూపంలో మరో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అయ్యిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ పోస్టర్స్, టీజర్ ద్వారా సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆయన.. ఇక ఈ మూవీ ట్రైలర్  రిలీజ్ డేట్, సినిమా చూడటానికి కావాల్సిన ఎంత పే చెయ్యాలో  ట్వీట్ చేశారు. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేస్తూ అందులో ఈ వివరాలన్నీ ఇచ్చారు.
 
వివరాల్లోకి వెళితే ..అడల్ట్ స్టార్ మియా మాల్కోవా, వ‌ర్మ కాంబినేష‌న్‌లో వ‌స్తున్నరెండో చిత్రం. గ‌తంలో ‘జీఎస్టీ’ అనే చిత్రం తీశాడు. ఈ చిత్రానికి సంబంధించిన టీజ‌ర్లు, ట్రైల‌ర్‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన రెండో ట్రైల‌ర్ శ‌నివారం సాయంత్రం 5గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిపాడు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ చిత్రం జూన్ 6న రాత్రి 9 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చెప్పాడు వ‌ర్మ.
 
అలాగే ప్ర‌స్తుతం క‌రోనా కార‌ణంగా థియేట‌ర్లు ఇంకా ఓపెన్ కాలేదు. దీంతో ఈ చిత్రాన్ని ఆన్‌లైన్‌లో రిలీజ్ చేయ‌నున్నాడు. డిజిటల్ పార్మాట్ లో స్పెషల్ గా ‘ఆర్జీవీ వరల్డ్’ అనే యాప్ ను డిజైన్ చేయించి శ్రేయాస్ ఎంటర్ టైన్ మెంట్స్ వాళ్లతో కలిసి ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నాడు. ”మియా మాల్కోవా ‘క్లైమాక్స్’ మూవీ జూన్ 6వ తేదీన రాత్రి 9 గంటలకు విడుదల కానుంది. 

ఈ మూవీని RGVWorld.in/ShreyasET వేదికపై చూడొచ్చు. పే ఫర్ వ్యూ మోడల్‌లో ఈ సినిమాను మీ ముందుకు తెస్తున్నా. ఒక్కో వ్యూ కోసం 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన లాగిన్ వివరాలు త్వరలోనే ప్రకటిస్తా అని త‌న ట్వీట్ చేశాడు వ‌ర్మ‌. కుర్రాళ్లు చాలా మంది ఈ సినిమా ఎప్పుడు చూద్దామా అని వెయిట్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో భారీగానే వర్మకు లాభం ముడుతుందని అంచనా వేస్తున్నారు. మొత్తానికి బూతు బొమ్మ చూపించి, కుర్రాళ్ల జేబులకు బొక్క పెడుతున్నాడన్నమాట. ఇక ఈ సొమ్ములో ఎక్కువ భాగం వర్మకే చెందేలా ఎగ్రిమెంట్  చేసుకున్నారట. నిర్మాతలు నామ మాత్రంగానే ఇన్ వాల్వ్ అవుతారని తెలుస్తోంది.