Asianet News TeluguAsianet News Telugu

బాలయ్యకు నో చెప్పిన సీనియర్ హీరోయిన్ టబు?

చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి సీనియర్ హీరోల పక్కన నటించడానికి ఇష్టపడుతున్న హీరోయిన్స్ బాలయ్య అంటే మాత్రం మొహమాటం లేకుండా నో అనేస్తున్నారు.

was tabu said no to balakrishna movie ksr
Author
Hyderabad, First Published Jun 19, 2021, 12:29 PM IST

స్టార్ హీరో బాలయ్య అంటే నో అంటున్న హీరోయిన్స్ లిస్ట్ ఎక్కువై పోతుంది. ఆయన కొత్త సినిమా ప్రకటించిన ప్రతిసారి హీరోయిన్ సమస్య తలెత్తుతుంది. ఫార్మ్ లో ఉన్న హీరోయిన్స్ బాలయ్య పక్కన నటించడం లేదు. కొన్నేళ్లుగా బాలయ్య సినిమాలలో నటించిన హీరోయిన్స్ లిస్ట్ చూస్తే ఈ విషయం కచ్చితంగా అర్థం అవుతుంది. టూ టైర్ హీరోయిన్స్ లేదా ఫార్మ్ లోని సీనియర్ హీరోయిన్స్ మాత్రమే బాలయ్య సినిమాకు ఒకే చెబుతున్నారు. 


బ్లాక్ బస్టర్ కాంబినేషన్ గా పేరున్న బోయపాటి-బాలయ్య సినిమాకు కూడా స్టార్ హీరోయిన్ దొరకలేదు. చివరకు అవకాశాలు లేక ఖాళీగా ఉన్న ప్రగ్యా జైస్వాల్ ని ఎంపిక చేశారు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి సీనియర్ హీరోల పక్కన నటించడానికి ఇష్టపడుతున్న హీరోయిన్స్ బాలయ్య అంటే మాత్రం మొహమాటం లేకుండా నో అనేస్తున్నారు. స్టార్ హీరోయిన్స్ చేయను అని చెప్పినా కొంచెం అర్థం ఉంది. గతంలో బాలయ్యతో రెండుసార్లు నటించిన టబు కూడా బాలయ్య సినిమాలో చేయనని చెప్పారన్న వార్త మరింత ఆశ్చర్యపరుస్తుంది. 


క్రాక్ తో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు గోపీచంద్ మలినేనితో బాలకృష్ణ మూవీ ప్రకటించారు. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ మూవీలో ఓ పాత్ర కోసం టబుని సంప్రదించగా చేయనని చెప్పారట. ఈ వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారగా కారణం తెలియక అందరూ జుట్టుపట్టుకుంటున్నారు. గతంలో చెన్నకేశవరెడ్డి, పాండురంగడు చిత్రాలలో టబు బాలయ్యతో జతకట్టారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios