ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లేటు కావడానికి కారణమైన అంశాలలో గాయాలు కూడా ఒకటి. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ఒకరి తరువాత మరొకరు ప్రమాదానికి గురయ్యారు. మొదట రామ్ చరణ్ మోకాలికి దెబ్బ తగలడంతో కొన్నాళ్ళు షూటింగ్ నిలిపివేయవలసి వచ్చింది. ఆ తరువాత ఎన్టీఆర్ చేయికి గాయం కావడం వలన, ఆయన కొన్నాళ్లు విశ్రాంతి తీసుకోవలసి వచ్చింది. పర్ఫెక్షన్ కోసం ఎన్టీఆర్, చరణ్ ల చేత కొన్ని ప్రమాదకరమైన స్టంట్స్ చేయిస్తున్నారు రాజమౌళి. 

ఆ మధ్య హైదరాబాద్ లో జరుగుతున్న ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ సెట్ కి వెళ్లిన చిరంజీవి దంపతులు, చరణ్ పై తీస్తున్న కొన్ని సన్నివేశాలకు కన్నీళ్లు పెట్టుకున్నారట. అత్యంత కష్టమైన సన్నివేశాలలో రామ్ చరణ్ పాల్గొన్నారట. అంతగా చరణ్, ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ కోసం రిస్క్ చేస్తున్నారు. 

ఐతే రామ్ చరణ్ మరలా స్వల్ప గాయాలపాలయ్యారేమో అనే సందేహం కలుగుతుంది. దీపావళి పండగ సంధర్భంగా ఆర్ ఆర్ ఆర్ టీమ్ శుభాకాంక్షలు తెలియజేశారు. దీని కోసం ప్రత్యేకంగా వేసిన సెట్ లో రాజమౌళి, చరణ్ మరియు ఎన్టీఆర్ సాంప్రదాయ బట్టలలో దర్శనం ఇచ్చారు. ఐతే ఈ ఫొటోలో రామ్ చరణ్ కాలిని గమనిస్తే ఆయన యాంకిల్ దగ్గర నీలి రంగు పట్టీ చుట్టుకొని ఉన్నారు. అది గమనించిన ఫ్యాన్స్ రామ్ చరణ్ కాలికి ఏమైందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరలా రామ్ చరణ్ కాలికి గాయం ఏదైనా అయ్యిందా అని భయపడుతున్నారు.