హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంపై అనేక కోణాలలో దర్యాప్తు సాగుతుంది. సీబీఐ ఎంట్రీ తరువాత ఈ కేసు వేగం పుంజుకుంది. ఇప్పటికే ఈ కేసులో అనుమానితులుగా కొందరిని ఎఫ్ ఐ ఆర్ లో నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా సుశాంత్ రాజ్ పుత్ ప్రేయసి రియా చక్రవర్తి మరియు ఆమె కుటుంబ సభ్యుల మెడ చుట్టూ ఈ కేసు చుట్టుకుంటుంది. అలాగే సుశాంత్ మాజీ మేనేజర్ శృతి మోడీ మరియు మరికొందరిని విచారిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలు అధికంగా జరిగిన తరుణంలో ఈడీ ఈ కేసులోకి ఎంటర్ కావడం జరిగింది. శుశాంత్ అకౌంట్ నుండి రూ. 15కోట్లు తరలిపోయాయని సుశాంత్ కుటుంబ సభ్యుల ఆరోపణ. సుశాంత్ బ్యాంకు అకౌంట్స్, ఆర్థిక లావాదేవీలపై ఈడీ దృష్టి పెట్టడం జరిగింది.

మరోవైపు సుశాంత్ సింగ్ మాజీ మేనేజర్ శృతి మోడీ, ఈడీ విచారణలో రియా చక్రవర్తి పై పలు కీలకవ్యాఖలు చేయడం జరిగింది. సుశాంత్ సినిమాలు, ఆర్థిక వ్యవహారాలు అన్నీ రియా చూసుకునేది అని ఆమె చెప్పడం, సుశాంత్ మృతిలో రియా ప్రమేయం పై మరిన్ని అనుమానాలు పెరుగుతున్నాయి. కాగా శుశాంత్ మృతికి కొద్దిరోజులు ముందు ఆయన మాజీ మేనేజర్ దిశా సలియాన్  మరణించడం అనేక అనుమానాలకు దారితీస్తుంది.

కొందరు దిశా సలియాని రేప్ చేసి చంపబడిందని, ఆమె అపార్ట్మెంట్ పై నుండి క్రింద పడిన సమయంలో ఒంటిపై బట్టలు లేవని , ఈ విషయాన్ని పోలీసులు దాస్తున్నారని చెబుతున్నారు. ఐతే ఈ విషయాన్ని పోలీసులు ఖండించడం జరిగింది. దిశా మరణించిన సమయంలో ఆమె ఒంటిపై బట్టలు లేవన్న ఆరోపణలలో నిజం లేదన్నారు. పోస్టుమార్టం సమయంలో ఆమె ఒంటిపై గాయాల గుర్తులు కూడా లేవని వారు చెప్పడం విశేషం.