Asianet News TeluguAsianet News Telugu

షాక్ :ఆ రెండు ఛానల్స్ బంద్!! కారణం ఇదే

భారతదేశం ,పాకిస్తాన్లలో HBO SD మరియు HD లీనియర్ మూవీ ఛానెల్స్ నిలిపివేయటానికి నిర్ణయం తీసేసుకున్నారు. భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్ , మాల్దీవులలో డిసెంబర్ 15 నుండి డబ్ల్యుబి లీనియర్ మూవీ ఛానెల్స్ ఉపసంహరించబడతాయని యాజమాన్యం తెలిపింది.  చాలా ఏళ్లుగా వార్నర్‌ మీడియా సౌత్‌ ఆసియాలో ఈ ఛానళ్లను ప్రసారం చేస్తున్నప్పటికి ఇక్కడ సుస్థిరమైన మార్కెట్‌ను ఏర్పరుచుకోవడానికి కష్టపడుతూనే ఉంది. 

WarnerMedia to discontinue HBO and WB TV channels in India jsp
Author
Hyderabad, First Published Oct 17, 2020, 7:18 AM IST

హాలీవుడ్ సినిమాలు టీవీలో చూసే వారికి హెచ్ బీ ఓ ఛానెల్ సుపరిచితమే. అయితే ఇక  ఈ ఏడాది చివరి నుంచి భారత్‌, పాకిస్తాన్, మాల్దీవులు, బంగ్లాదేశ్‌లో హెచ్‌బీఓ, డబ్యూబీ ఛానళ్లను వార్నర్‌మీడియా నిలిపివేయనుంది. భారతదేశం ,పాకిస్తాన్లలో HBO SD మరియు HD లీనియర్ మూవీ ఛానెల్స్ నిలిపివేయటానికి నిర్ణయం తీసేసుకున్నారు. భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్ , మాల్దీవులలో డిసెంబర్ 15 నుండి డబ్ల్యుబి లీనియర్ మూవీ ఛానెల్స్ ఉపసంహరించబడతాయని యాజమాన్యం తెలిపింది.  చాలా ఏళ్లుగా వార్నర్‌ మీడియా సౌత్‌ ఆసియాలో ఈ ఛానళ్లను ప్రసారం చేస్తున్నప్పటికి ఇక్కడ సుస్థిరమైన మార్కెట్‌ను ఏర్పరుచుకోవడానికి కష్టపడుతూనే ఉంది. 

హెచ్‌బీఓ, డబ్యూబీ టీవీ ఛానెళ్ల సబ్‌సిప్షన్ పొందటానికి నాలుగు నుంచి ఐదు డాలర్ల ఖర్చు అవుతుంది. అయితే భారతదేశంలో దీని ధర కేవలం రెండు డాలర్లగా మాత్రమే ఉంది. అయినప్పటికీ ఇతర దేశాలతో పోలిస్తే ఈ ఛానళ్లను వీక్షించేవారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లు, డిస్నీ హార్ట్‌ స్టార్‌, నెట్‌ఫ్లిక్స్‌ లాంటి ఆన్‌లైన్‌ వేదికలు అందుబాటులోకి  వచ్చిన తరువాత ఈ ఛానళ్లను చూడటానికి ఎవరు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో వీటి మనుగడ ఇక్కడ కష్టంగా మారడంతో వార్నర్‌ మీడియా డిసెంబర్‌ 15 నుంచి హెచ్‌బీఓ, డబ్యూబీ ఛానళ్లను  నిలిపివేయాలని నిర్ణయించుకుంది. అయితే భారతదేశంలో కార్టూన్ నెట్‌వర్క్,  పోగో  ఛానళ్లలను కొనసాగిస్తామని, అదేవిధంగా ఇంటర్నేషనల్‌ సీఎన్‌ఎన్‌ను కూడా ప్రసారం చేస్తామని వార్నర్‌ మీడియా యాజమాన్యం పేర్కొంది. 
 
వార్నర్ మీడియా గ్రూప్ ఇప్పుడు  కార్టూన్ నెట్‌వర్క్ మరియు పోగో వంటి ఛానెల్‌లతో పిల్లల విభాగంలో దృష్టి సారించనుందని క్యాంపెయిన్ ఇండియా నివేదించింది. ఇది స్థానిక యానిమేషన్ ఉత్పత్తిని కూడా పెంచుతుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios