Asianet News TeluguAsianet News Telugu

నన్ను చెడగొట్టావ్, ఇక దొబ్బకు తల్లి.. శ్రీసత్యపై రగిలిపోయిన శ్రీహాన్

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 6 తుది అంకానికి చేరుకుంది. ప్రస్తుతం హౌస్ లో 6 మంది సభ్యులు ఉన్నారు. వీరంతా టైటిల్ గెలవడం కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. 

war of words between Srihan and Srisathya
Author
First Published Dec 15, 2022, 11:13 PM IST

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 6 తుది అంకానికి చేరుకుంది. ప్రస్తుతం హౌస్ లో 6 మంది సభ్యులు ఉన్నారు. వీరంతా టైటిల్ గెలవడం కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. వీరి తెలివికి, సమయ స్ఫూర్తికి పరీక్ష పెట్టేలా బిగ్ బాస్ టాస్క్ లు ఇస్తున్నారు. 

గురువారం ఎపిసోడ్ లో ప్రేక్షకులకు ఓట్ అప్పీల్ చేసుకునే అంశం చుట్టూ ఆగింది. బిగ్ బాస్ ఇంటి సభ్యులకు కొన్ని టాస్క్ లు ఇచ్చి వాటిలో గెలిచిన వారికి.. ప్రేక్షకులని ఓట్ అప్పీల్ చేసుకునే ఛాన్స్ కల్పించారు. ముందుగా కొన్ని శబ్దాలు వినిపించారు. ఆ శబ్దాల ఆధారంగా వాటి పేర్లు రాయాలి. 

ఈ టాస్క్ లో రోహిత్, ఆదిరెడ్డి విజయం సాధించారు. వీరిద్దరిలో ఎవరికి ఓట్ అప్పీల్ ఛాన్స్ కల్పించాలో ఇతర ఇంటి సభ్యులు ఏకాభిప్రాయంతో నిర్ణయించుకోవాలి. మిగిలిన సభ్యుల్లో ముగ్గురు రోహిత్ కి ఓట్ వేయడంతో అతడికి ఓట్ అప్పీల్ ఛాన్స్ వచ్చింది. దీనితో రోహిత్ ప్రేక్షకులకు అప్పీల్ చేశాడు. ఇప్పటి వరకు తనకి సపోర్ట్ చేసినందుకు కృతజ్ఞతలు తెలిపాడు. 

ఇకపై కూడా ప్రేక్షకులు తనకు ఓట్ వేసి సపోర్ట్ ఇవ్వాలని, తాను బిగ్ బాస్ టైటిల్ గెలవాలని పట్టుదలతో ఉన్నట్లు రోహిత్ తెలిపాడు. ఇక ఈ టాస్క్ జరుగుతున్నప్పుడు శ్రీహన్, శ్రీసత్య మధ్య ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. కొన్ని శబ్దాలు వచ్చే సమయంలో శ్రీసత్య మాట్లాడి డిస్ట్రబ్ చేసింది. దీనితో ఆ శబ్దాలు ఏంటో శ్రీహన్ కి అర్థం కాలేదు. ఫలితంగా పాయింట్స్ లో శ్రీహన్ వెనుకబడ్డాడు. 

టాస్క్ పూర్తయ్యాక శ్రీహాన్.. శ్రీసత్యపై తన కడుపు మంట బయట పెట్టాడు. నీవల్లే ఈ టాస్క్ కోల్పోయా అంటూ శ్రీసత్యని నిందించాడు. నావల్ల కేవలం రెండు పాయింట్స్ మాత్రమే పోయాయి.. మిగిలిన పాయింట్స్ తెచ్చుకుని ఉండొచ్చు కదా అంటూ శ్రీసత్య వాదించింది. నన్ను చెడగొట్టావ్, ఇక దొబ్బకు తల్లి అంటూ శ్రీహాన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. 

అలాగే కోడి గుడ్లు గాజు గ్లాసులపై జాగ్రత్తగా ఉంచే టాస్క్ కూడా జరిగింది. ఈ టాస్క్ లో శ్రీసత్య, రేవంత్ విజయం సాధించారు. ఇంటి సభ్యులు ఏకాభిప్రాయంతో శ్రీసత్యకి ఓట్ అప్పీల్ చేసుకునే ఛాన్స్ కల్పించారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios