హృతిక్ రోషన్ - టైగర్ ష్రాఫ్ కథానాయకులుగా నటించిన మల్టీస్టారర్ చిత్రం వార్. దసరా కానుకగా అక్టోబర్ 2న రిలీజ్ కానున్న ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ సినిమా కోసం వివిధ దేశాల్లో యాక్షన్ సీన్స్ ని 100కోట్లతో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 

ఇక సినిమాను తెలుగులో కూడా భారీగా రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే తెలుగు ట్రైలర్ ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు మరో తెలుగు సాంగ్ తో సినిమాపై మరింత అంచనాలను పెంచేశారు. యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు విశాల్ అండ్ చంద్ర శేఖర్ సంగీతం అందిస్తున్నారు.