వాల్తేర్ వీరయ్య టైటిల్ సాంగ్‌పై వివాదం.. ఆయనకు పురాణాలు తెలుసా : యండమూరి వ్యాఖ్యలు, చంద్రబోస్ కౌంటర్
మెగాస్టార్ చిరంజీవి , బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘‘వాల్తేరు వీరయ్య’’లోని టైటిల్ సాంగ్‌పై వివాదం నెలకొంది. గేయ రచయిత చంద్రబోస్‌ను ఉద్దేశిస్తూ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మెగాస్టార్ చిరంజీవి , బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘‘వాల్తేరు వీరయ్య’’ సినిమా కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. రిలీజ్ టైమ్ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు మొదలెట్టింది. ఇప్పటికే పాటలు, ఫస్ట్ లుక్, ట్రైలర్, టీజర్‌లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఇటీవల విడుదల చేసిన వాల్తేర్ వీరయ్య టైటిల్ సాంగ్ ఆకట్టుకుంటోంది. అయితే ఈ పాట రాసిన ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్‌పై రచయిత యండమూరి వీరేంద్రనాథ్ మండిపడ్డారు.
పాట రాసిన వ్యక్తి ఏ పురాణాలు చదివారంటూ ఆయన ఫైర్ అయ్యారు. చంద్రబోస్‌కు ఏ సంప్రదాయం తెలుసునంటూ యండమూరి ప్రశ్నించారు. దీనిపై సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో చంద్రబోస్ స్పందించారు. విరోధాభాషలంకారంలో అర్ధాన్ని వివరించారు . అధ్యయనం చేయాల్సిన పాటను అవమానిస్తారా అని చంద్రబోస్ కౌంటరిచ్చారు. మరి దీనిపై యండమూరి స్పందిస్తారో లేదో వేచి చూడాలి.
Also REad: తుఫాను అంచున తపస్సు చేసే వశిష్టుడు.. ట్రెండింగ్‌లో వాల్తేర్ వీరయ్య టైటిల్ సాంగ్..
కాగా.. వాల్తేర్ వీరయ్య` టైటిల్ సాంగ్‌ని సోమవారం సాయంత్రం రిలీజ్ చేశారు. `తుఫాను అంచున తపస్సు చేసే వశిష్ణుడు` అంటూ సాగే టైటిల్ సాంగ్‌ని రిలీజ్ చేయగా అది యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటని చంద్రబోస్ రాశారు. శేఖర్ మాస్టర్ నృత్యాలు సమకూర్చారు. ఈ పాటని అనురాగ్ కులకర్ణ అలాప్, పవిత్ర చారి ఆలపించారు. దీనికి బ్రాస్ ఆర్కేస్ట్రా సంస్థ బ్యాంకాక్ కి చెందిన ఆర్కేస్ట్రా బృందాలతో కలిసి పనిచేయడం విశేషం.
ఇక వాల్తేర్ వీరయ్య వీరత్వాని, పరాక్రమాన్ని ఆవిష్కరించేలా సాగే ఈ పాట ఆద్యంతం ఆకట్టుకుంటుంది. గూస్‌బంమ్స్ తెప్పిస్తుంది. మెగా ఫ్యాన్స్ అదిరిపోయే ట్రీట్ లా ఉంది. గత పాట విషయంలో కాస్త అసంతృప్తి వ్యక్తం కాగా, ఆ లోటుని ఈ పాట భర్తీ చేసింది. చిరంజీవి ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేలా ఉంది. ఇందులో చిరంజీవి లుక్స్ అదిరిపోయాయి. సినిమాపై ఈ పాట అంచనాలు భారీగా పెంచేస్తుంది. సంక్రాంతి కానుకగా జనవరి 13న వాల్తేర్ వీరయ్య రిలీజ్ కానుంది. రవితేజ కీలక పాత్రలో, శృతి హాసన్ హీరోయిన్‌గా నటించారు.