Asianet News TeluguAsianet News Telugu

‘వాల్తేరు వీరయ్య’ నటుడు బాబీ సింహాకు హత్యా బెదిరింపులు.. ఫ్రెండ్సే మోసం చేశారు?

‘వాల్తేరు వీరయ్య’ నటుడు బాబీ సింహాకు హత్యా బెదిరింపులు రావడం హాట్ టాపిక్ గ్గా మారింది. తెలుగు ప్రాంతానికి చెందిన ఆయన చెన్నైలోనే నివాసం ఉంటున్నారు. 
 

Waltair Veerayya Actor Bobby Sinha Receives Death Threats NSK
Author
First Published Sep 22, 2023, 5:21 PM IST

మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’లో విలన్ పాత్ర పోషించిన బాబీ సింహా (Bobby Simha) నటనతో ఆకట్టుకున్నారు. సాల్మన్ సీజర్ గా అలరించారు. తమిళ చిత్రాలతో తన కెరీర్ ను ప్రారంభించి ఆయన తెలుగు, మలయాళంలోనూ చాలా చిత్రాల్లో నటించారు. విభిన్న పాత్రలు పోషించి ప్రేక్షకుల్లో గుర్తింపు దక్కించుకున్నారు. ఇదిలా ఉంటే.. బాబీ సింహాకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. ఆయన స్నేహితుల నుంచే హత్యా బెదిరింపులు రావడం హాట్ టాపిక్ అయ్యింది. 

విషయం ఏంటంటే.. తమిళ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన చెన్నైలోని కొడైకెనాల్ లో  సెటిల్ అయ్యారు. అక్కడే ఓ ఇంటిని కూడా నిర్మించుకున్నారు. అయితే ఈ ఇంటి నిర్మాణం విషయంలోనే హత్యా బెదిరింపులు వస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై బాబీ సింహానే మాట్లాడుతూ.. ‘కొడైకెనాల్ లో ఇల్లు నిర్మించాలని అనుకున్నా. దాంతో తమిళనాడులో పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉన్న వ్యక్తి ఉసేన్.. అతని పరిచయస్తుడు బిల్డింగ్ కాంట్రాక్టర్ జమీర్ తో ఇంటి నిర్మాణ పనులకు ఒప్పందం కుదుర్చుకున్నాం.

కోటీ 30 లక్షల వరకు నిర్మాణం కోసం అగ్రిమెంట్ చేసుకుం. ఆ తర్వాత ఉసేన్, జమీర్ నా నుంచి రూ.40 లక్షల వరకు అదనంగా తీసుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చారు. అయినా పనిపూర్తవ్వలేదు. వెంటనే కొడైకెనాల్ పీఎస్ లో ఫిర్యాదు చేశాను. రాజకీయ నేపథ్యం ఉండటంతో పోలీసులూ చర్యలు తీసుకోలేదు. దాంతో కోర్టుకూ వెళ్లాం.’ అని బాబీ పేర్కొన్నారు. కానీ, బాబీ సింహాకు స్నేహితులైనా వారే అతనిపై తిరిగి కేసు పెట్టారు. ఇదిలా ఉంటే.. రూ.1.11 కోట్లు మోసపోయానని ఆ డబ్బు తిరిగి ఇప్పించాలని బాబీ సింహా తరుపు న్యాయవ్యాది తెలిపారు. ఇంతటి వారు ఆగకుండా ‘సినిమాలో నువ్వు విలన్ కావొచ్చు.. మేం రియల్  విలన్స్’ అంటూ బెదిరిస్తున్నారని, ఓ ఎమ్మెల్యే అండతోనే ఇదంతగా జరుగుతుందని ఆరోపించారు. ఏదేమైనా ప్రస్తుతం ఈ ఇష్యూ హాట్ టాపిక్ గ్గా మారింది.

బాబీ సింహా ఈ ఏడాది సౌత్ లో వరుస చిత్రాలతో బిజీగా కనిపించారు. తెలుగులో బాబీ సింహా ‘లవ్ ఫెల్యూర్’, ‘రన్’, ‘డిస్కో రాజా’, ‘ఏదైనా జరగొచ్చు’, ‘గల్లీ రౌడీ’, ‘అమ్ము’ వంటి చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ‘రాజకార్’ అనే సినిమాలో కీలక పాత్ర పోషించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios