వైజయంతీ-తారక్.. ‘మహానటుడు’!

Vyjayanthi movies next with tarak
Highlights

వైజయంతీ-తారక్.. ‘మహానటుడు’!

సీనియర్ ఎన్టీయార్- వైజయంతీ మూవీస్.. నాటి తెలుగు ఇండస్ట్రీలో ఒక తిరుగులేని కాంబినేషన్. ఎన్టీయార్ హీరోయిజాన్ని వైజయంతీ ఎలివేట్ చేస్తే.. వైజయంతీ బేనర్ ప్రతిష్టని ఎన్టీయార్ సినిమాలు పెంచేశాయి. ఎదురులేని మనిషి, యుగపురుషుడు లాంటి సినిమాలు చరిత్రలో నిలబడిపోయినవే! కట్ చేస్తే.. జూనియర్ ఎన్టీయార్‌తో సైతం అదే ‘రిలేషన్’ కంటిన్యూ చేయాలని వైజయంతి అధినేత అశ్వనిదత్ భావించారు. ‘స్టూడెంట్ నంబర్-1’ మూవీతో తారక్- దత్తు కాంబో బాగా గట్టిపడింది. కానీ.. ఇదే వరుసలో వచ్చిన కంత్రి, శక్తి మూవీస్ నిరాశపర్చేశాయి. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని.. వైజయంతి మూవీస్‌లో సెకండ్ జెనరేషన్ ముందుకొచ్చింది. అశ్వనిదత్ కూతుర్లు మొదలుపెట్టిన కొత్త బేనర్ ‘మహానటి’ మూవీతో సక్సెస్‌ఫుల్ జర్నీ మొదలుపెట్టేసింది.

మహానటి’ ప్రమోషన్లో తారక్ వాటా కూడా చాలా పెద్దది! ‘మహానటి’ ఊపును కంటిన్యూ చేయాలని భావిస్తున్న దత్ క్యాంప్.. ఇక్కడ కూడా తారక్‌నే నమ్ముకున్నట్లుంది. తమ బంధం మరింత దృఢపడ్డం కోసం.. మరిన్ని కొత్త ప్రాజెక్టులు ప్లాన్ చేస్తున్నట్లు అశ్వనీదత్ చెప్పుకొచ్చారు. తారక్‌తో కలిసి వైజయంతీ మూవీస్ చేయబోయే మూవీపై కసరత్తు షురూ అయ్యిందట! ఈ విషయాన్ని అశ్వనీదత్ స్వయంగా చెప్పేశారు. ప్రస్తుతం.. త్రివిక్రమ్, రాజమౌళి ప్రాజెక్టుల్లో చేస్తున్న తారక్.. వైజయంతీ మూవీస్ కోసం మరో ‘సెన్సేషనల్’ డైరెక్టర్‌ని లైన్లో పెట్టినట్లు.. దత్తు, తారక్ ఇద్దరూ కలిసి విడతల వారీగా ‘స్టోరీ డిస్కషన్స్’లో కూర్చుంటున్నట్లు వార్తలొస్తున్నాయి. సో.. తారక్#30 భారీతనం ఎంతన్న అంచనాల్లో ఇప్పట్నుంచే మునిపోయింది ఆయన అభిమాన గణం!

loader