సంక్రాంతి ని టార్గెట్ చేసుకొని ప్రతిసారి పోటీలో నిలిచే బాలకృష్ణ ఈ సారి కూడా భారీ స్థాయిలో ఎన్టీఆర్ బయోపిక్ తో వచ్చాడు. ఫస్ట్ పార్ట్ కథానాయకుడు బాలకృష్ణ కెరీర్ లోనే అత్యధిక థియేటర్ లో రిలీజయింది. అయితే కలెక్షన్స్ పరంగా మొదటి రోజు అనుకున్నంతగా షేర్స్ అందుకోలేదు. తెలుగు రాష్ట్రాల్లో కనీసం 10 కోట్ల షేర్స్ కూడా రాలేవు. 

70 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన కథానాయకుడు సక్సెస్ అవ్వాలంటే ముందు బయ్యర్స్ ని సేఫ్ జోన్ లోకి తేవాలి. ఆ స్థాయిలో కలెక్షన్స్ బాలయ్య రాబడతాడా లేదా అనేది సందేహంగా ఉంది. పైగా మరికొన్ని గంటల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యాక్షన్ మూవీ వినయ విధేయ రామ రిలీజ్ కాబోతోంది. బాలకృష్ణ గత సినిమాలు గౌతమి పుత్ర శాతకర్ణి - టెంపర్ సినిమా రేంజ్ లో కూడా మొదటి రోజు బయోపిక్ కి కలెక్షన్స్ రాకపోవడం గమనార్హం. 

ఇక చరణ్ సినిమా విడుదలై కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా ఆడియెన్స్ అందరూ అటువైపే టర్న్ అవుతారు. కనీసం యాక్షన్స్ ఎపిసోడ్స్ తో అయినా ఆ సినిమా మినిమమ్ వసూళ్లను రాబట్టగలదు. అడ్వాన్స్ బుకింగ్స్ తో ఇప్పటికే సినిమా అంచనాలను మరింతగా పెంచేస్తోంది. ఇక వరుణ్ - వెంకటేష్ ల ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ కోసం ఫ్యామిలీ ఆడియెన్స్ ఎక్కువగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ ఫైట్ లో బాలకృష్ణ కథానాయకుడు ఎంతవరకు లాభాలను అందిస్తుందో చూడాలి.