కమర్షియల్ చిత్రాలకు కేరాఫ్ ఎడ్రస్ డైరక్టర్ వివి వినాయక్ . ఆయన దర్శత్వంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. తను చేస్తన్న హీరో ఇమేజ్‌కు తగ్గట్లుగా కమర్షియల్ అంశాలు జోడించి హిట్ కొట్టడంలో వివి వినాయక్‌ది అందెవేసిన చేయి. ఓ టైమ్ లో వినాయిక్ తో సినిమా చెయ్యాలని హీరోలు ఉవ్విళ్లూరారు. కానీ పరిస్దితులు మారాయి. వినాయిక్ కథ చెప్తానంటే హీరోలెవరూ ఇంట్రస్ట్ చూపటం లేదు.

మరీ ముఖ్యంగా యంగ్ హీరోలకు వినాయక్ ఓ మూస దర్శకుడుగా కనపడుతున్నారు. అందుకు కారణం ఆయన అఖిల్ తొలి చిత్రం , సాయి ధరమ్ తేజ తో చేసిన ఇంటిలిజెంట్ మూవి లు డిజాస్టర్ కావటమే. వినాయిక్ దర్శకుడు కథను తెరకెక్కించటంలో ఫెయిల్ కాకపోవచ్చేమో కానీ  ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్లుగా కథలు ఎంపిక చేసుకోవడంలో విఫలం అయ్యారనేది నిజం.  అందుకే వివి వినాయక్‌కు ఇటీవల సరైన విజయం లేదని అందరూ తేల్చేసారు.

వివి వినాయక్ తెరకెక్కించిన మెగాస్టార్ కంబ్యాక్ మూవీ ఖైదీ నెం 150 చిత్రం ఘనవిజయం సాధించినా.. ఆ తరువాత వచ్చిన ఇంటెలిజెట్ మూవీ తీవ్రంగా నిరాశపరిచింది. ఈ నేపధ్యంలో గ్యాప్ తీసుకున్న వినాయిక్ ఇప్పుడు ఓ స్క్రిప్టు రెడీ చేసుకుని తన స్టామినా ఏంటో చూపాలని ఫిక్స్ అయ్యారట. 

రీసెంట్ గా రవితేజను కలిసి ఓ కథను నేరేట్ చేసారట. గతంలో వివి వినాయిక్ , రవితేజ కాంబినేషన్ లో వచ్చిన కృష్ణ సూపర్ హిట్. అలాంటి కామెడీ, యాక్షన్ కలిపిన కథనే వినాయిక్ రెడీ చేసారని వినికిడి. ప్రస్తుతం ఫైనల్ డ్రాఫ్ట్ రెడీ చేస్తున్నారట. సి కళ్యాణ్ నిర్మించనున్న ఈ చిత్రం ఈ సంవత్సరం షూటింగ్ పూర్తి చేసుకున్నా..వచ్చే సంవత్సరమే రిలీజ్ అంటున్నారు. అందుకు కారణం..రవితేజ బిజీగా వరస ప్రాజెక్టులతో ఉండటమే.