దర్శకుడిగా ఫెయిల్ అవుతున్న వివి.వినాయక్ నెక్స్ట్ హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణతో రెండు మూడు సార్లు స్క్రిప్ట్ డిస్కర్షన్ లో కూర్చొని మెప్పించలేకపోయిన వినాయక్ ఫైనల్ గా దిల్ రాజు సెట్ చేసిన ఒక కథలో హీరోగా నటించడానికి ఒప్పుకున్నాడు. 

కథ నచ్చడంతో వెంటనే నటించడానికి ఒప్పుకున్న ఈ దర్శకుడు ఫిట్ నెస్ లో మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. మొదటి షెడ్యూల్ కి అలాగే సెకండ్ షెడ్యూల్ కి వినాయక్ లో చాలా మార్పులు రావాలట. ప్రస్తుతం ఉన్న పర్సనాలిటీ ఫస్ట్ షెడ్యూల్ కి సరిపోతుందని అయితే సెకండ్ షెడ్యూల్ లో మాత్రం సన్నగా యువకుడిలా కనిపించాలని స్క్రిప్ట్ డిమాండ్ చేస్తోందట. 

దర్శకుడు నర్సింహారావు ఆలోచనలకు తగ్గట్టుగా ఒక బాడీ లాంగ్వేజ్ ని సెట్ చేసుకున్న ఈ సీనియర్ దర్శకుడు ఎలాగైనా కథకు న్యాయం చేయాలనీ కష్టపడుతున్నాడు. త్వరలో సినిమాను మొదలుపెట్టి వీలైనంత త్వరగా ప్రేక్షకులకు సినిమాను అందించాలని దిల్ రాజు ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి ఈ డిఫరెంట్ కాంబినేషన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.