ప్రస్తుతం హీరో మంచు విష్ణుకి సరైన మార్కెట్ లేదు.. అతడితో సినిమాలు చేయడానికి దర్శకనిర్మాతలు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. తాజాగావిష్ణు హీరోగా 'ఓటర్' అనే సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్ విష్ణు ఎక్కడా కనిపించలేదు.. పైగా సినిమా విడుదల ఆపే ప్రయత్నం చేశారు.

దర్శకుడు కూడా పట్టించుకోకపోవడంతో సినిమాకి పబ్లిసిటీ రాలేదు. అయినప్పటికీ ఈ సినిమాను ఎలాగోలా విడుదల చేయాలని నానాతంటాలు పడి థియేటర్ లో షో పడేలా చూసుకున్నాడు నిర్మాత. కానీ ఈ సినిమా పరిస్థితి రిలీజ్ తరువాత మరింత గోరంగా తయారైంది.

మొదటిరోజు కనీసం థియేటర్ లో పది మంది ప్రేక్షకులు కూడా లేక చాలా చోట్ల షోలు క్యాన్సిల్ చేశారు. ఎవరో తెలియని హీరో నటించిన 'ఫస్ట్ ర్యాంక్ రాజు' సినిమాకి ఉన్న బజ్ కూడా విష్ణు సినిమాకి లేదు. మాములుగా విష్ణు సినిమాకి బజ్ లేకపోయినా, నెగెటివిటీ కనిపించినా.. క్రిటిక్స్ మాత్రం అతడి సినిమాకు వెళ్తారు.. కానీ ఈసారి వాళ్లు కూడా సినిమాను పట్టించుకోలేదు.

సినిమా చూసిన ఒకరిద్దరు మాత్రం సోషల్ మీడియాలో తమ అభిప్రాయం వెల్లడించారు. అది కూడా అంత గొప్పగా ఏమీలేదు. ఈ సినిమాకి పెట్టిన పెట్టుబడి సంగతి తరువాత కనీసం పబ్లిసిటీ, పోస్టర్లకు అయిన ఖర్చు కూడా తిరిగొచ్చే అవకాశం కనిపించట్లేదు.