మంచు విష్ణు హీరోగా నటించిన 'ఓటర్' సినిమాపై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. దర్శకుడు కార్తిక్ కి, మంచు విష్ణుకి మధ్య వివాదం నడిచింది. మంచు విష్ణు తనను మానసికంగా వేధిస్తున్నాడని, చంపే అవకాశాలు కూడా ఉన్నాయని సంచలన కామెంట్స్ చేశారు.

దీంతో సినిమా ఇప్పట్లో విడుదల కాదని అనుకున్నారు. కానీ ఇప్పుడు రాజీ కుదుర్చుకొని సినిమాను విడుదల చేయడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొంది.

యు/ఏ సర్టిఫికెట్ వచ్చినట్లు నిర్మాతలు తెలిపారు. జూన్ లో సినిమాను విడుదల చేయబోతున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో సినిమాపై వస్తోన్న ఆరోపణల్లో నిజం లేదని పేర్కొన్నారు. ఓటు విలువ, ఓటర్ విలువ గురించి చెప్పే  చిత్రమిది అంటూ చెప్పుకొచ్చారు. చక్కని సందేశంతో పాటు వినోదాన్ని కూడా పంచే చిత్రమంటూ వెల్లడించారు.