తమిళంలో విషాదం నెలకొంది. ప్రముఖ తమిళ నటుడు,యాంకర్, వీజే ఆనంద్ కన్నన్‌(48) కన్నుమూశారు. గత కొంత కాలంగా క్యాన్సర్‌ తో పోరాడుతున్న ఆయన సోమవారం తుది శ్వాస విడిచారు. 

ప్రముఖ టెలివిజన్‌ హోస్ట్, నటుడు ఆనంద్‌ కన్నన్‌(48) కన్నుమూశారు. 1990-20 మధ్య నటుడిగా, వీజేగా చేసి ఆకట్టుకున్న ఆయన ఆకస్మిక మరణం తమిళ చిత్ర పరిశ్రమని షాక్‌కి గురి చేసింది. గత కొంత కాలంగా క్యాన్సర్‌ పోరాడుతున్న ఆయన సోమవారం తుదిశ్వాస విడిచారు. దీంతో తమిళ చిత్ర వర్గాలు తీవ్ర దిగ్ర్భాంతి చెందడంతోపాటు ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం తెలియజేస్తున్నాయి. 

ఆనంద్‌ కన్నన్‌ యాంకర్‌గా కెరీర్‌ని ప్రారంభించారు. సింగపూర్‌లో ఆయన యాంకరింగ్‌ చేసిన ఆయన ఆ తర్వాత చెన్నైకి షిఫ్ట్ అయ్యారు. ప్రముఖ రేడియోలో ఆర్జేగా చేశారు. ఆ తర్వాత ప్రముఖ టీవీ ఛానెల్‌లో జాయిన్‌ అయి వీజేగా,యాంకర్‌గా రాణించారు. చిన్న వయసులోనే యాంకర్‌గా పాపులర్‌ భారీ అభిమాన గణాన్ని సొంతం చేసుకున్నారు. యాంకర్‌గానే కాదు టీవీ సీరియల్స్ లో, పలు సినిమాల్లో నటుడిగా రాణించారు. 

వీజే ఆనంద్‌ కన్నన్‌ మృతి పట్ల తమిళ చిత్ర ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. వారిలో ఫిల్మ్ మేకర్ వెంకట్‌ ప్రభు, ఆర్జే ధీనా ట్విట్టర్‌ ద్వారా సంతాపం తెలిపారు.

Scroll to load tweet…