యూత్ అంతా జీయోలో లేదంటే ఓయోలో.. సన్నీ `సౌండ్ పార్టీ` ట్రైలర్ ఫన్ రైడ్
`బిగ్ బాస్ 5` విన్నర్ వీజే సన్నీ.. హీరోగా ఇప్పుడు `సౌండ్ పార్టీ` అనే మూవీ రాబోతుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. ఫన్ రైడర్‌గా ఆకట్టుకుంటుంది.

`బిగ్ బాస్` ఐదో సీజన్‌లో విన్నర్‌గా నిలిచాడు వీజే సన్నీ. ఆ ఒక్క షోతో సన్నీకి బాగా పాపులర్ అయ్యాడు. ఆయనకు ఊహించని క్రేజ్ వచ్చింది. క్రేజ్‌తోపాటు సినిమా ఆఫర్లు వచ్చాయి. హీరోగా ఆయనకు అవకాశాలు క్యూ కట్టడం విశేషం. అంతకు ముందే హీరోగా ప్రయత్నాలు చేస్తూ స్ట్రగుల్ అయిన సన్నీకి `బిగ్ బాస్` లైఫ్ ఇచ్చిందని చెప్పొచ్చు. దీంతో వచ్చిన అవకాశాల్లో బెస్ట్ ఎంపిక చేసుకుని హీరోగా రాణించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ మధ్య సన్నీ నటించిన `అన్ స్టాపబుల్` అనే మూవీ థియేటర్లో ఆశించిన స్థాయిలో వర్కౌట్ కాలేదు.
ఇప్పుడు మరో సినిమా `సౌండ్ పార్టీ`తో హిట్ కొట్టేందుకు వస్తున్నారు. అయితే ఈ సారి పూర్తి కామెడీ సినిమాని ఎంచుకున్నారు. మంచి ఫ్యామిలీ ఎలిమెంట్లు, కామెడీ ఎంటర్‌టైనర్‌గా `సౌండ్ పార్టీ` అనే చిత్రంలో నటించారు. దీనికి సంజయ్ శేరి దర్శకత్వం వహించారు. ప్రముఖ దర్శకుడు జయశంకర్ సమర్పకులుగా వ్యవహరించారు. వి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఆద్యంతం ఫన్ రైడర్‌గా ట్రైలర్ సాగుతూ ఆకట్టుకుంటుంది.
ట్రైలర్ లో ప్రారంభం నుంచి అదిరిపోయే పంచు డైలాగ్స్ తో ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా హీరో వీజే సన్ని, శివన్నారాయణ కు మధ్య వచ్చే డైలాగ్స్, సీన్లు క్రేజీ గా, కామెడీగా ఉన్నాయి. యూత్ ని ఎట్రాక్ట్ చేస్తున్నాయి. అందుకు మచ్చుతునకే ``ప్రస్తుతం యూత్ అంతా జియో , ఓయో మీదే నడుస్తోంది అంటూ శివన్నారాయణ చెప్పిన డైలాగ్. వీరితో పాటు ఇందులో సప్తగిరి, థర్టీ ఇయర్స్ పృధ్వీ ఇంకా ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి కమెడియన్స్ పేరు తెచ్చుకున్న వాళ్లంతా ఈ చిత్రంలో కనిపిస్తున్నారు. ఫన్‌కి కొదవలేదనేలా ట్రైలర్ ఉంది. మరి అంతకు మించి ఏం ఉండబోతుందనేది ఆసక్తికరం. ఒకన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్లని ఇందులో చర్చిస్తున్నట్టు హీరో గతంలో చెప్పారు. అదేంనేది చూడాలి.
సినిమా ఎప్పుడో పూర్తయ్యింది, కానీ సరైన డేట్ కోసం వేచి చూసింది. ఎట్టకేలకు ఈ నెల 24న విడుదల చేయాలని నిర్ణయించారు. దీంతో ప్రమోషన్స్ కార్యక్రమాల జోరు పెంచారు. అందులో భాగంగానే ట్రైలర్‌ని విడుదల చేశారు. మోహిత్ రెహమానికి మ్యూజిక్ , శ్రీనివాస రెడ్డి సినిమాటోగ్రఫీ బాగా కుదిరినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఫ్యామిలీ అండ్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు . ఇవ్వన్నీ దృష్టిలో పెట్టుకుని దర్శకుడు సింగిల్ లైన్ పంచ్ డైలాగ్స్ తో, మంచి కాస్టింగ్స్ తో అన్ని వర్గాల ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ సౌండ్ పార్టీ చిత్రాన్ని ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఉండబోతుందని టీమ్ చెబుతుంది. ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం-1గా రూపొందిన `సౌండ్ పార్టీ` చిత్రంలో వీజే సన్నీ, హ్రితిక శ్రీనివాస్ జంటగా నటించారు.
శివన్నారాయణ, అలీ, సప్తగిరి, థర్టీ ఇయర్స్ పృథ్వి, ‘మిర్చి’ ప్రియ, మాణిక్ రెడ్డి, అశోక్ కుమార్, కాదంబరి కిరణ్, ‘జెమిని’ సురేష్, భువన్ సాలూరు, ‘ఐ డ్రీమ్’ అంజలి, ఇంటూరి వాసు, చలాకి చంటి, ప్రేమ్ సాగర్, ఆర్.జె. హేమంత్, శశాంక్ మౌళి, త్రినాధ్, కృష్ణ తేజ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : శ్రీనివాస్ రెడ్డి, ఎడిటర్ : జి. అవినాష్ ; సంగీతం: మోహిత్ రెహమానిక్ ; ప్రొడక్షన్ డిజైనర్ : రాజీవ్ నాయర్ ; కో - రైటర్స్ : పటేల్ నందుర్క, సుందర్ పాలుట్ల ; లిరిక్స్ : పూర్ణ చారి ; చీఫ్ కో-డైరెక్టర్ : చిన్న ; కో-డైరెక్టర్ : బి. సంతోష్ కృష్ణ ; అసోసియేట్ డైరెక్టర్స్ : యశ్వంత్ వలబోజు, కృష్ణ చైతన్య. టి ; అసిస్టెంట్ డైరెక్టర్స్ : యష్, దిలీప్ కుమార్ రాజు, యువన్ ఫణీంద్ర. యస్ ; పి. ఆర్. ఓ. : జీ కె మీడియా ; లైన్ ప్రొడ్యూసర్ : శివకాంత్ వంగ ; ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : భువన్ సాలూరు. నిర్మాతలు : రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర ; సమర్పణ : జయశంకర్ ; రచన - దర్శకత్వం : సంజయ్ శేరి.
Read more: Spark Life Movie: విక్రాంత్ ‘స్పార్క్ లైఫ్’ మూవీ రివ్యూ..!