‘సలార్‌’తో వ్యాక్సిన్‌ ‘వార్‌’ఖరారు, ఏంటా ధైర్యం?


‘సలార్‌’ (Salaar)తో బాక్సాఫీస్‌ వద్ద పోటీ పడేందుకు ఓ క్రేజీ బాలీవుడ్‌  ప్రాజెక్ట్‌  సిద్ధమయిన్నట్లు వార్తలు వస్తున్నాయి.

Vivek Ranjan Agnihotri #TheVaccineWar vs prabhs #Salaar clash CONFIRMED jsp

  ప్రభాస్‌ (Prahas)నెక్ట్స్  బిగ్గెస్ట్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సలార్‌’ (Salaar) అన్న సంగతి తెలిసిందే.కేజీఎఫ్ వంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌  డైరక్ట్ చేస్తున్న చిత్రం కావటంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. పాన్‌ ఇండియా స్థాయిలో సిద్ధమవుతోన్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 28న విడుదల చేయనున్నట్లు చిత్రటీమ్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, అదే రోజున బాలీవుడ్‌ నుంచి మరో పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ విడుదలవుతోంది. దీంతో, సెప్టెంబర్‌ 28న బాక్సాఫీస్‌ వద్ద వార్‌ నెలకొనవచ్చని ట్రేడ్ లో  విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఆ సినిమా ఏమిటి? దాని విశేషాలేమిటంటే..?
 
'ది కశ్మీర్ ఫైల్స్' సినిమాతో బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు. ఆయన తెరకెక్కిస్తోన్న సరికొత్త చిత్రం ‘ది వ్యాక్సిన్‌ వార్‌’. కరోనా వైరస్‌ నుంచి ప్రజలను రక్షించడానికి వ్యాక్సిన్‌ ఎలా కనిపెట్టారు? ఆ సమయంలో ఎలాంటి ఛాలెంజ్ లు ఎదురయ్యాయి? వంటి ఆసక్తికర అంశాలతో ఇది సిద్ధమవుతోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా ఆగస్టులో విడుదల చేయాలని వివేక్‌ భావించారు. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాని సెప్టెంబర్ 28కు విడుదల వాయిదా వేసి రిలీజ్ చేస్తున్నారు. ‘సలార్‌’ రిలీజ్‌ రోజునే దీన్నీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే యోచనలో చిత్రటీమ్ ఉండటంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఈ మేరకు అఫీషియల్ ఎనౌన్సమెంట్ కూడా వచ్చింది.
 

ప్రభాస్‌ సినిమాతో వివేక్‌ అగ్నిహోత్రి తలపడటం ఇదేమీ తొలిసారి కాదు. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన 'రాధే శ్యామ్' మార్చి 11న థియేటర్లలోకి వచ్చింది. భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. 'రాధే శ్యామ్'తో పాటు మార్చి 11న 'ది కశ్మీర్ ఫైల్స్' కూడా విడుదల అయ్యింది. మొదట ఆ సినిమాను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. మౌత్ టాక్, పైగా వివాదాస్పద అంశంపై రూపొందిన సినిమా కావడంతో ప్రేక్షకులు మెల్లగా ఆసక్తి కనబరిచారు. దాంతో 'కశ్మీర్ ఫైల్స్' సంచలన విజయం సాధించింది.  ప్రభాస్ (రాధే శ్యామ్)పై పోటీలో 'కశ్మీర్ ఫైల్స్'తో విజయం సాధించానని, ఇప్పుడు 'వ్యాక్సిన్ వార్'తో కూడా సేమ్ ఫీట్ రిపీట్ చేస్తానని వివేక్ అగ్నిహోత్రి కామెంట్ చేసినట్లు కొందరు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. కానీ సలార్ సత్తా తెలిసిన వారు ఎవరూ తక్కువ అంచనా వేయరుగా.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios