బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ తెలుగు ప్రేక్షకులకు కూడాపరిచయమే.. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'రక్త చరిత్ర' సినిమాతో అతడికి మంచి గుర్తింపు లభించింది. అయితే బాలీవుడ్ లో అవకాశాలు బాగుండడంతో అతడు తెలుగు సినిమాలు చేయలేదు. ఇప్పుడు రామ్ చరణ్-బోయపాటి కాంబినేషన్ లో రానున్న సినిమాలో విలన్ గా వివేక్ ఒబెరాయ్ ను తీసుకున్నారు.

దాని కోసం అతడికి 1.25 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వగా, షెడ్యూల్స్ పెరగడంతో డబుల్ రెమ్యునరేషన్ ఇవ్వమని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. చేసేదేం లేక మేకర్స్ కూడా అడిగినంత ఇచ్చేశారు. అయితే తాజాగా నాని-నాగార్జున నటిస్తోన్న మల్టీస్టారర్ సినిమా 'దేవదాస్' లో విలన్ పాత్ర కోసం వివేక్ ఒబెరాయ్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది. దానికి ఆయన 2.5 కోట్ల రెమ్యునరేషన్ చెప్పి నిర్మాతలకు షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

విలన్ పాత్ర కోసం పైగా తక్కువ కాల్షీట్స్ అయినా.. అంత మొత్తంలో డిమాండ్ చేయడంతో డ్రాప్ అయిపోయారు. ఇప్పుడు దేవదాస్ లో విలన్ కోసం వెతికే పనిలో పడ్డారు.