90వ దశకంలో కశ్మీర్ పండిట్‌లపై జరిగిన దాడులు.. వారిపై సాగిన హత్యాకాండకు సంబంధించిన కథాంశంతో ఈ సినిమా రూపొందించారు. ఇందులో మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, పల్లవి జోషి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇప్పుడు ఎక్కడ విన్నా ‘కశ్మీర్ ఫైల్స్’ ఫైల్స్ సినిమా కబుర్లే వినపడుతున్నాయి. కశ్మీర్ మారణహోమాన్ని తెరపై చూపించి కళ్లకు కట్టే ప్రయత్నం చేశారు బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి. ‘కశ్మీర్ ఫైల్స్’ పేరిట ఆ సినిమాను థియేటర్లలోకి విడుదల చేస్తే ఓ రేంజిలో రెస్పాన్స్ వచ్చింది. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్, పల్లవి జోషి తదితరులు కీలక పాత్రలు పోషించారు. 1990ల్లో కశ్మీరీ పండిట్లపై జరిగిన అకృత్యాలు, హత్యాకాండలను సినిమాలో చూపించారు. ఈ సినిమా అందరి నుంచి సినిమా ప్రశంసలను అందుకుంటోంది.సినిమా చూసిన ప్రేక్షకులు భావోద్వేగానికి గురవుతున్నారు.
ఓ మహిళ సినిమా చూసిన అనంతరం డైరెక్టర్ అగ్నిహోత్రి కాళ్లపై పడిపోయారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆమెను పైకిలేపిన వివేక్ అగ్నిహోత్రి.. ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. ఆమె ఆయనపై పడి బోరున విలపించింది. చాలా బాగా సినిమా తీశారంటూ మెచ్చుకుంది. ఆ తర్వాత నటుడు దర్శన్ కుమార్ నూ పట్టుకుని ఆమె ఏడ్చేసింది. దీంతో దర్శన్ కూడా కళ్ల నిండా నీళ్లు నింపుకున్నారు. ఇప్పటికే హర్యానా ప్రభుత్వం పన్ను మినహాయింపునిచ్చింది. దానికి డైరెక్టర్ అగ్నిహోత్రి కృతజ్ఞతలు తెలిపారు. కరోనా కాలంలో ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న తమకు పన్ను రూపంలో మినహాయింపులను ఇచ్చినందుకు ధన్యవాదాలు అని తెలిపారు.
90వ దశకంలో కశ్మీర్ పండిట్‌లపై జరిగిన దాడులు.. వారిపై సాగిన హత్యాకాండకు సంబంధించిన కథాంశంతో ఈ సినిమా రూపొందించారు. ఇందులో మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, పల్లవి జోషి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా చూసి చిత్ర దర్శక, నిర్మాతలైన వివేక్ అగ్నిహోత్రితో పాటు తెలుగు నిర్మాత అభిషేక్ అగర్వాల్‌ను అభినందించారు.
అప్పట్లో కశ్మీర్‌లో జరిగిన సంఘటనలను కళ్లకు కట్టినట్టు చూపించారని ప్రధాని అభినందించినట్టు చిత్ర దర్శక, నిర్మాతలు పేర్కొన్నారు. ఈ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 3.55 కోట్ల వసూళు చేసిందని ప్రముఖ బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ పేర్కొన్నారు.
1990లో హిందు పండిత్స్ పై అప్పటి వరకు అక్కడే వారితో కలిసి మెలిసి తిరిగిన కొంత మంది వేరే మతానికి చెందిని వారు అక్కడ స్థానిక హిందూవుపై దారుణ మారుణ కాండకు పాల్పడ్డరు. వారి ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. వారికి అక్కడ నిలువ నీడ లేకుండా చేసి స్వదేశంలోనే శరణార్ధులుగా అయ్యేలా చేసారు.
మొత్తంగా కశ్మీర్ లోయలో చోటు చేసుకున్న ఈ భయానక సంఘటనలతో కశ్మీర్ పండిత్స్ కట్టుబట్టలతో మన దేశంలోని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. అప్పట్లో జరిగిన ఈ దారుణ మరుణ కాండకు కేంద్రంలో ఉన్న ఓ మంత్రి పరోక్షంగా సాయం చేసినట్టు చెప్తారు. ఇవన్నీ సినిమాలో చూపించారు. ఈ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంటోంది. ఈ సినిమా మన దేశంలో 561 స్క్రీన్స్‌లో విడుదలైంది. ఓవర్సీస్‌లో 113 స్క్రీన్స్‌లో ఈ సినిమా విడుదలైంది.
కశ్మీర్‌లోని తీవ్రవాదులు, వేర్పాటువాదుల దాడుల వల్ల ఓ సామాజిక వర్గం ఎలా అంతమైందో ప్రచార చిత్రంలో భావోద్వేగభరితంగా చూపించారు. సినిమాలో యాక్షన్‌కు పెద్ద పీట వేసారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘కశ్మీర్‌లో జరిగిన హత్యాకాండను తెరపైకి తీసుకురావడం అంత సులభమేమీ కాదు. ఎంతో సున్నితంగా ఈ అంశాన్ని చూపించాలి. భారత చరిత్రలో జరిగిన ఘోరమైన ఘట్టాలను వాస్తవికంగా తెరపై చూస్తారు. ఈ చిత్రం ఎంతో మందికి కనువిప్పు కలిగిస్తుంది’’ అన్నారు.
