కరీనా కపూర్ కు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు కాశ్మీరి ఫైల్స్ డైరెక్ట్ వివేక్ అగ్నిహోత్రి. రెండు వర్గాలుగా చిలీన బాలీవుడ్ ఒకరిపై ఒకరు విమర్షల బాణాలు ఎక్కుపెట్టుకుంటున్నారు.  ఇంతకీ కరీనాపై వివేక్ ఏం కామెంట్స్ చేశారు. 

బాలీవుడ్ లో బాయ్‌కాట్‌ లాల్‌ సింగ్‌ చడ్డా వివాదం ఇంకా రగులుతూనే ఉంది. సినిమా రిలీజ్ అయ్యి చాలా రోజులు అవుతున్నా వివాదం మాత్రం రోజురోజుకు ముదురుతూనే ఉంది. ఈ విషయంలో లాల్ సింగ్ చడ్డా హీరో ఆమిర్‌ ఖాన్‌కు కొంత మంది హీరోలు, ఇతర నటులు మద్ధతు లభిస్తుంటే.. మరికొంత మంది మాత్రం ఆయనన్ను వ్యతిరేకిస్తున్నారు. అయితే అమీర్ ఖాన్ కు మద్దతుగా ఉన్న హీరోలకు సైతం బాయ్‌కాట్‌ సెగ గట్టిగా తాకుతోంది. 

ఇప్పటి వరకూ అమీర్ కు అండగా నిలిచిన అక్షయ్‌ కుమార్‌, హృతిక్‌ రోషన్‌లు తిప్పలు తప్పలేదు. అమీర్ కు సపోర్ట్‌ చేయడంతో వారి సినిమాలను కూడా బహిష్కరించాలంటూ నెటిజన్లు ప్రచారం చేస్తున్నారు. ఇదిలా ఉంటే లాల్‌ సింగ్‌ చడ్డాకు వసూళ్లు పడిపోవడంపై రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఈ మూవీ హీరోయిన్ కరీనా కపూర్ స్పందించారు. ఆవేదన వ్యక్తం చేశారు. లాల్‌ సింగ్‌ చడ్డా మంచి సినిమా అని, ఇలాంటి సినిమాను ఆధరించకుండా ఎందుకు వెలివేస్తున్నారో తెలియడంలేదు అంటూ బాధపడింది. 

ఈ సినిమా కోసం దాదాపుగా మూడేళ్ల పాటు 250 మంది ఎంతో కష్టపడ్డారని వారి కష్టాన్ని వృదా చేయడం సరికాదు అన్నారు. ఇక ఈ వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు ది కశ్మీర్‌ ఫైల్స్‌.. డైరెక్టర్‌ వివేక్‌ అగ్నిహోత్రి. బాలీవుడ్ డాన్‌లుగా నటులు వ్యవహరించి, హిందూ ఫోబియాతో చిన్న సినిమాలు రిలీజ్ కాకుండా ఆగిపోయినప్పుడు మీరెక్కడికెళ్లారు అని ప్రశ్నించాడు. ఈ విషయాన్ని ఆయన ట్వీట్‌ చేశారు. వివేక్ ట్వీట్టర్ లో ఏం రాశారంటే..? చిన్న సినిమాలు, మంచి కంటెంట్‌ ఉన్న మూవీస్ ను బాలీవుడ్‌ డాన్‌లుగా పిలవబడే నటులు అడ్డుకున్నప్పుడు, ఆ సినిమాలకు థియేటర్లకు ఇవ్వకుండా ఆపేసినప్పుడు మీరెందుకు స్పందించలేదు అని అడిగారు. 

Scroll to load tweet…

అంత పెద్ద స్టార్లు ఇలా చేయడం వల్లే దేశంలో టాలెంట్ ఉన్న చాలా మంది న నటులు, దర్శకులు, రచయితల జీవితాలు నాశమయ్యాయి అన్నారు వివేక్. అంతే కాదు. ఆ సినిమాలకు పని చేసింది కూడా 250 మంది పేద ప్రజలే అంటూ కౌంటర్‌ ఇచ్చాడు. అలాగే మరొ ట్వీట్‌లో బాలీవుడ్‌ డాన్‌ల ఆహంకారం, హిందూ ఫోబియా గురించి భారతీయులకు తెలిసినప్పుడు వారిని వేడి కాఫీ ముంచేస్తారు అంటూ వివేక్‌ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. దాంతో ఈ వివాదం ఇంకా ముదురుతోంది. మరి ఈ వివాదానికి పుల్ స్టాప్ పడేది ఎప్పుడో అంటూ ఎదురు చూస్తున్నారుజనాలు.

Scroll to load tweet…

ఇక బాలీవుడ్ స్టార్ అమీర్‌ ఖాన్‌, కరీనా కపూర్‌లు హీరోహీరోయిన్లుగా నటించిన లాల్‌సింగ్‌ చడ్డా ఆగష్టు 11న రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలు టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగా చైతన్య కీ రోల్‌ పోషించాడు. అద్వైత్ చందన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. కాని వివాదాల సుడిగుండంలో చిక్కుకుని అశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. బాక్సాఫీస్‌ వద్ద ఈ సినిమా కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి.