వీరం, వేదాలం, వివేగం వంటి సూపర్‌హిట్‌లను అందించిన అజిత్‌-శివ కాంబినేషన్‌లో 'విశ్వాసం' రాబోతోన్న సంగతి తెలిసిందే.  ఈ చిత్రం సంక్రాంతి బరిలో దిగనుంది.   అజిత్‌ కెరీర్‌లో 58వ చిత్రంగా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని  సెంథిల్‌ త్యాగరాజన్, అర్జున్‌ త్యాగరాజన్‌ నిర్మించారు. నయనతార  హీరోయిన్ . జగపతిబాబు స్టైలిష్‌ విలన్‌ పాత్రలో నటించారు.

ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది.  ఇప్పటికే మూవీ యూనిట్ విశ్వాసం ప్రమోషనల్ కార్యక్రమాల్లో జోరు చూపిస్తుంది. తమిళనాట రజినీకాంత్ పెటా సినిమాకి పోటీగా అజిత్ విశ్వాసం విడుదలవుతుంది. పేట మీద ఎంతగా ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయో అజిత్ విశ్వాసం మీద కూడా అంతే అంచనాలు ఉన్నాయి.  ఈ నేపధ్యంలో ఈ చిత్రం కథ ఏమై ఉంటుందనేది తమిళనాట హాట్ టాపిక్ గా మారింది. 

అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం కథ వెంకటేష్ నటించిన తులిసి చిత్రానికి జెరాక్స్ కాపీలా ఉందని తెలుస్తోంది.  ఇంతకు ఆ స్టోరీ లైన్ ఏమిటీ అంటే... అజిత్ ...ఎవరైనా రెచ్చ గొట్టినా రెచ్చిపోయే వ్యక్తి. ముఖ్యంగా తన ఎదురుగా అన్యాయం జరిగితే చూస్తే ఊరుకోలేడు. అంతేకాదు అతనో గ్యాంగ్ కు హెడ్ కూడా. 

ఇక అజిత్, నయనతారలు ప్రేమించుకుంటారు. ప్రేమించుకుని పెళ్లి కూడా చేసుకుంటారు. అయితే ఓ గొడవలో అతను తన భార్య డెలవరీ టైమ్ లో అక్కడ ఉండలేకపోతాడు. దాంతో ఇద్దరి మధ్యా పెద్ద గొడవ అవుతుంది. ఆ బిడ్డ చనిపోయిందని చెప్తారు. దాంతో నయనతార విడిపోతుంది. ఆ తర్వాత విడిపోయిన వారిద్దరు మళ్లీ 12 ఏళ్ల తర్వాత కలుస్తారు. ఆ టైమ్ లోనే ఆ పాప బ్రతికే ఉందని తెలుస్తుంది. అంతేకాదు విలన్ జగపతిబాబు ఆమె ను కిడ్నాప్ చేసాడని తెలుస్తుంది. విలన్ నుండి పాపను అజిత్ ఎలా కాపాడాడు, ఇద్దరు మళ్లీ ఎలా కలిశారు అనేది సినిమా నేపథ్యం అంటూ ప్రచారం జరుగుతుంది. ఈ కథంతా చదువుతూంటే వెంకటేష్, నయనతార కాంబినేషన్ లో వచ్చిన తులసి సినిమా గుర్తురావటంలేదా.