మోహన్ లాల్ స్వయంగా ఈ పుస్తకాన్ని విడుదల చేస్తున్నారు. ఇదొక కవిత్వం పుస్తకం. పెంగ్విన్ ఇండియా సంస్ధ దీన్ని విడుదల చేస్తోంది. ఈ పుస్తకం విడుదల సందర్బంగా అందరూ ఆమెకు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. పీటీఐకు ఇచ్చిన ఇంటర్వూలో విస్మయ ఈ పుస్తకం గురించి వివరించింది. 

విస్మయ మాట్లాడుతూ.. ‘గ్రెయిన్స్ ఆఫ్ స్టార్డస్ట్’ ను తను రాస్తానని ఊహించలేదంది. ఓ కవిత్వం పుస్తకం రాయాలని అసలు ఇంటెన్షన్ లేదని వివరించింది. వాటిని మీరు చదివితే అవి చాలా సింపుల్ గా రాసారని అర్దమవుతుందని చెప్పింది. సబ్ వే లో కూర్చుని నా ఫోన్ లో అప్పుడప్పుడు రాసుకున్నవే ఈ కవిత్వం అన్నారు. నాకు ఇష్టమైన బీట్ వింటూ వీటిని రానానని ఆమె అంది. నేను ప్రకృతిని చూస్తున్నప్పుడో, ఓ పెయింటింగ్ ని తిలకిస్తున్నప్పుడో ఈ కవిత్వం నాలో జన్మించింది అని వివరించింది. 
 
అలాగే విస్మయ ఇప్పుడు  తన అట్రాక్టివ్ లుక్ తో అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. గతంలో ఊబకాయంతో ఎంతో ఇబ్బంది పడ్డ ఈ స్టార్ డాటర్.. తనని తాను శిల్పంగా మలుచుకొని అందరి చేత ఆశ్చర్యపరుస్తోంది. ఆమె లేటెస్ట్ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఊబకాయంతో బాధపడుతున్న విస్మయ.. కొంతకాలం క్రితం థాయ్ లాండ్ కు వెల్లి అక్కడ నిపుణుల పర్యవేక్షణలో కఠినమైన ఆహార వ్యాయామ నియమాలను పాటిస్తూ బరువు తగ్గే కార్యక్రమం మొదలు పెట్టింది. అంతేకాకుండా.. మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ లో కఠినమైన శిక్షణ తీసుకుంది. ఈ కఠోర సాధన ఫలితంగానే తాను బరువు తగ్గానని ప్రకటించింది విస్మయ.  ఈ వెయిట్ లాస్ ప్రక్రియను  "జీవితాన్ని మార్చే అనుభవం" గా అభివర్ణించిన విస్మయ.. ఈ కఠోర సాధన ద్వారా తాను 22 కిలోల బరువు తగ్గినట్టు చెప్పారు.

 ప్రస్తుతం తన మొదటి పుస్తకం ‘గ్రెయిన్స్ ఆఫ్ స్టార్డస్ట్’ పైనే ఆమె దృష్టి ఉంది. ఈ పుస్తకంలో కవితలతోపాటు ఆకర్షణీయమైన చిత్రాలు ఉంటాయని చెప్తోంది.