కోలీవుడ్ లో 100 కోట్ల మార్కెట్ ఉన్న స్టార్ హీరోల్లో అజిత్ ఒకరు. శివ దర్శకత్వంలోనే ఇప్పటికే హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న ఈ కాంబినేషన్ ఈ సారి విశ్వాసం సినిమాతో మరో ఇండస్ట్రీ హిట్ అందుకోవాలని చూస్తున్నారు. సినిమాకు సంబందించిన ట్రైలర్ ను కూడా వదిలారు. అయితే వయసు పై బడిన మధ్య వయస్కుడిగా అజిత్ ప్రజెంటేషన్ తెగ ఆకట్టుకుంటోంది. 

అసలు ఇప్పటివరకు వచ్చిన సినిమాలన్నీ ఒక లెక్క ఇప్పుడు రాబోయే సినిమా మరో లెక్క అన్నట్టుగా ట్రైలర్ చెప్పకనే చెబుతోంది. కత్తి పట్టుకొని ఊర మాస్ లెవెల్లో యాక్షన్ సీన్స్ తో విశ్వరూపం చూపిస్తున్నాడు. విశ్వాసం పూర్తిగా తమిళ నేటివిటీకి తగ్గట్లుగా ఉందని చెప్పవచ్చు.  సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. 

ఇక తెలుగులో కూడా సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు ఇమ్మన్ సంగీతం అందించారు.