Asianet News TeluguAsianet News Telugu

స్టార్ హీరో సినిమాకి చెత్త ఓపెనింగ్స్!

కోలివుడ్ స్టార్ హీరో అజిత్ కి అభిమానుల్లో ఎంతటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాలకు ఏవరేజ్ టాక్ వచ్చినా.. భారీ కలెక్షన్స్ వస్తుంటాయి. 

vishwasam movie first day openings
Author
Hyderabad, First Published Mar 2, 2019, 4:01 PM IST

కోలివుడ్ స్టార్ హీరో అజిత్ కి అభిమానుల్లో ఎంతటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాలకు ఏవరేజ్ టాక్ వచ్చినా.. భారీ కలెక్షన్స్ వస్తుంటాయి. కానీ తెలుగులో మాత్రం ఈ హీరో సినిమాలకు పెద్దగా ఆదరణ దక్కడం లేదు.

ఇక్కడ చిన్న హీరోల సినిమాలకు వచ్చే కలెక్షన్స్ కూడా అజిత్ సినిమాలకు రావడం లేదు. అజిత్ నటించిన 'విశ్వాసం' సినిమా పొంగల్ కానుకగా తమిళంలో విడుదలైన భారీ వసూళ్లు రాబట్టింది. బాహుబలి తరువాత అక్కడ ఆ రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టింది ఈ సినిమానే. 

ఈ సినిమాను అదే పేరుతో తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 450 స్క్రీన్ లలో సినిమా విడుదలైంది. కానీ మొదటి రోజు రాబట్టిన షేర్ కేవలం ముప్పై  లక్షలు మాత్రమే. ఇక్కడ సినిమా రివ్యూ నెగెటివ్ గా రావడం, పెద్దగా ప్రమోషన్స్ కూడా చేయకపోవడంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా చతికిలపడింది.

లాంగ్ రన్ లో ఈ సినిమా రెండున్నర కోట్లు రాబడితేనే ఇక్కడ నిర్మాతలు నష్టాల నుండి బయటపడగలరు. కానీ సినిమా పరిస్థితి చూస్తుంటే ఆ నెంబర్ దాటడం కష్టమనే అనిపిస్తోంది.  

Follow Us:
Download App:
  • android
  • ios