బ్యాక్ గ్రౌండ్ లేకపోతే ప్రతీ నా కొడుకు గేమ్ మారుద్దాం అనుకుంటాడు
ఇవన్నీ గమనించే విశ్వక్ సేన్ ...ఈ రేంజిలో ఫైర్ అయ్యారని తెలుస్తోంది. అయితే ఎవరిని ఉద్దేశించి ఈ ట్వీట్ చేసారని మాత్రం తెలియటం లేదు.
యంగ్ హీరో విశ్వక్‌సేన్ చేసినవి తక్కువ సినిమాలే కానీ మంచి మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా దాస్ కా ధమ్కీ సినిమాతో హిట్ కొట్టి ఫామ్ లో ఉన్నాడు మరో మూడు సినిమాలు కమిటయ్యి వరస షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో దాస్ కా ధమ్కి తర్వాత విశ్వక్ సేన్ (Vishwak Sen) చేస్తున్న చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తునారు. పిరియడ్ విలేజ్ పొలిటికల్ డ్రామాగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో నేహా శెట్టి, అంజలి ఫీమేల్ లీడ్స్ లో నటిస్తున్నారు. ఈ చిత్రం రిలీజ్ డేట్ విషయమై ఏం జరిగిందో ఏమో కానీ ట్విట్టర్ లో ఓ రేంజిలో ఫైర్ అయ్యాడు. బ్యాక్ గ్రౌండ్ లేకపోతే ప్రతీ నా కొడుకు మనగేమ్ మారుద్దాం అనుకుంటాడు..డిసెంబర్ కాకపోతే నన్ను #GOG ప్రమోషన్స్ లో చూడరు అంటూ ట్వీట్ చేసారు.
ఈ మూవీని డిసెంబర్ 8న విడుదల చేసే ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే రీసెంట్ గా ఈ చిత్రాన్ని డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నట్టు నెట్టింట ఓ న్యూస్ హల్ చల్ చేసింది. పొలిటికల్ ఎలిమెంట్స్‌తో సాగే యాక్షన్ ప్యాక్‌డ్ సినిమాగా రాబోతున్న ఈ చిత్రం ఇప్పుడు డిసెంబర్ లో కూడా రాకుండా మరింత ముందుకు వెళ్లబోతున్నట్లు వినపడుతోంది. డిసెంబర్ 8 న విశ్వక్సేన్ తన సినిమా రిలీజ్ కోరుకుంటున్నారు. దానికి తేడా కొడుతుందని గమనించే విశ్వక్ సేన్ ...ఈ రేంజిలో ఫైర్ అయ్యారని తెలుస్తోంది. అయితే ఎవరిని ఉద్దేశించి ఈ ట్వీట్ చేసారని మాత్రం తెలియటం లేదు. ఏదైమైనా నయా రిలీజ్ డేట్‌పై మేకర్స్ అధికారిక ప్రకటన ఇవ్వాల్సిన టైమ్ వచ్చింది.
ఇక ఈ చిత్రంలో చాలా స్పెషల్స్ ఉన్నాయని వినికిడి. బాహుబలి చిత్రంతో మనోహరీగా గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి.. ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్‌లో మెరవనుందని సమాచారం. రంగస్థలం జిగేల్ రాణి పాట తరహాలో ఊర మాస్ గా ఉండబోతుంది ఈ స్పెషల్ సాంగ్. నోరా మంచి డ్యాన్సర్. ఈ పాటలో ఆమె డ్యాన్సులు స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉండబోతున్నాయనే టాక్ నడుస్తుంది. ఇప్పటికే సినిమా నుంచి విశ్వక్‌సేన్, అంజలి ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేసి పీరియాడిక్ మాస్ యాక్షన్ డ్రామా అని చెప్పేశారు. గోదావరి జిలాల్లో జరిగే మాస్ యాక్షన్ డ్రామా అని తెలుస్తుంది. గోదావరిపై సినిమా, అది కూడా ఇలా మస్ యాక్షన్ లో తెలంగాణ కుర్రోడు అయిన విశ్వక్ ప్రకటించడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గ్లింప్స్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. ఇక ఈ సినిమాని శ్రీకర ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ కలిసి నిర్మిస్తున్నాయి.