కనీసం నెల రోజుకు పూర్తి కాకుండానే ఓరి దేవుడా ఓటీటీలో వచ్చేసింది. ఆహాలో ఓరి దేవుడా మూవీ నేటి అర్థ రాత్రి నుండి స్ట్రీమ్ కానుంది.  


థియేటర్స్ ని బ్రతికించాలంటూ నిర్మాతలు చేసిన వాగ్దానాలు, పెట్టిన నిబంధనలు ఎక్కడా అమలవుతున్న దాఖలాలు లేవు. థియేటర్స్ లో ఆదరణ నోచుకోని సినిమాలు, చిన్న చిత్రాలు రెండు మూడు వారాలకే ఓటీటీలో వచ్చేస్తున్నాయి. థియేటర్స్ కి ప్రేక్షకులు రావడం మానేశారు. దానికి ప్రధాన కారణం ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ అంటూ నిర్మాతలు గగ్గోలు పెట్టారు. థియేటర్స్ వ్యవస్థను కాపాడాలంటే కొత్త చిత్రాలు నాలుగు వారాల తర్వాత ఓటీటీలో విడుదల చేయాలంటూ తీర్మానం కూడా చేశారు. 

క్షేత్ర స్థాయిలో వాటి అమలు జరగడం లేదు. భారీ విజయం సాధించిన చిత్రాలు మాత్రమే ఆలస్యంగా ఓటీటీలోకి వస్తున్నాయి. తాజాగా వెంకటేష్-విశ్వక్ సేన్ లు నటించిన ఓరి దేవుడా మూవీ దారుణంగా మూడు వారాల లోపే ఓటీటీలో ప్రసారానికి సిద్ధమైంది. ప్రముఖ తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్ ఆహాలో నేటి అర్థ రాత్రి నుండి ఓరి దేవుడా స్ట్రీమ్ కానుంది. అక్టోబర్ 21న విడుదలైన ఈ మూవీ 30 రోజులు గడవకుండానే ఓటీటీలోకి వచ్చేసింది. 

Scroll to load tweet…

ఈ మేరకు ఆహా అధికారిక ప్రకటన చేసింది. విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్ జంటగా నటించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో వెంకటేష్ కీలక రోల్ చేశారు. ఓరి దేవుడా.. తమిళ హిట్ మూవీ ఓ మై కడువులే అధికారిక రీమేక్. ఒరిజినల్ కి దర్శకత్వం వహించిన అశ్వద్ మారిముత్తు తెరకెక్కించారు. మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న ఓరి దేవుడా వసూళ్లపరంగా పర్వాలేదు అని పించింది. ఈ చిత్ర ఓటీటీ హక్కులు దక్కించుకున్న ఆహా నవంబర్ 11 నుండి అందుబాటులోకి తేనుంది.