Asianet News TeluguAsianet News Telugu

విశ్వక్‌ సేన్‌ చెబుతున్న `ముఖ్య గమనిక`.. `వాస్తవం`గా టీజర్‌ అదిరింది..

జిమ్‌ ఫ్రెండ్‌ కోసం వచ్చాడు మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్‌. సినిమాకి అండగా నిలిచాడు. మరోవైపు లవ్‌, రొమాన్స్, థ్రిల్లర్‌ మిక్స్ డ్‌గా `వాస్తవం` మూవీ వస్తుంది. టీజర్‌ ఎలా ఉందంటే..
 

vishwak sen support to mukhya gamanika movie and vasthavvam teaser interesting arj
Author
First Published Feb 20, 2024, 11:33 PM IST

`ముఖ్య గమనిక`కి విశ్వక్‌ సేన్‌ సపోర్ట్.. 

మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్‌ చిన్న సినిమాలను ఎంకరేజ్‌ చేస్తున్నాడు. తన పెద్ద స్టార్స్ హెల్ప్ తీసుకుంటున్నట్టుగానే తను కూడా చిన్న సినిమాలను ఎంకరేజ్‌ చేస్తున్నారు. కొత్త వారికి సపోర్ట్ గా నిలుస్తున్నడు. తాజాగా ఆయన `ముఖ్య గమనిక` చిత్రం కోసం సపోర్ట్ చేశారు. ఈ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో సందడి చేశారు. సినిమా ప్రమోషనల్‌తో తనవంతు భాగమయ్యారు. సినిమాని జనంలోకి తీసుకెళ్లేందుకు హెల్ప్ అవుతున్నారు. 

విరాన్ ముత్తంశెట్టి హీరోగా నటిస్తున్న చిత్రమిది. ఆయన విశ్వక్‌ సేన్‌కి జిమ్‌ ఫ్రెండ్‌ అట. ఇందులో లావణ్య హీరోయిన్ గా నటిస్తుంది. శివిన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజశేఖర్,  సాయి కృష్ణ నిర్మాతలుగా కొత్త దర్శకుడు వేణు మురళీధర్. వి దర్శకత్వంలో వస్తున్న సినిమా `ముఖ్య గమనిక`. ఇప్పటివరకు రిలీజ్ అయిన పాటలు, టీజర్, ట్రైలర్ కు భారీ స్పందన లభిస్తోంది. సోమవారం హీరో విశ్వక్ సేన్ ముఖ్యఅతిథిగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఆయన మాట్లాడుతూ : విరాన్ నేను జిమ్ ఫ్రెండ్స్. చాలా మంచి వ్యక్తి. వెనక ఎంత బ్యాగ్రౌండ్ ఉన్న తన సొంత కష్టం మీద పైకి రావాలనుకుంటున్నాడు. ఫిబ్రవరి 23న ఈ సినిమా రిలీజ్ అవుతుంది విరాన్ కి ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని టీమ్ అందరికీ కూడా పెద్ద విజయం అందాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా` అని తెలిపారు. 

డైరెక్టర్ వేణు మురళీధర్ మాట్లాడుతూ : నేను ఇవాళ ఈ పొజిషన్లో ఉన్నాను అంటే కారణం అల్లు అర్జున్ గారు. విరాన్ ముత్తంశెట్టి ఈ సినిమా ఒప్పుకోవడం నా అదృష్టం. సమయాన్ని కరెక్ట్ గా పాటించే వ్యక్తి. హీరోయిన్ లావణ్య చాలా బాగా చేసింది. కిరణ్ అందించిన మ్యూజిక్ చాలా బాగా వచ్చింది` అని చెప్పారు. హీరో విరాన్ ముత్తంశెట్టి మాట్లాడుతూ, `మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాలు కూడా ఈ సినిమాలో ఉన్నాయి. నా వెనకే ఉండి నన్ను సపోర్ట్ చేసే అల్లు అర్జున్ గారికి నా కజిన్ శిరీష్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమా ఖచ్చితంగా మంచి సక్సెస్ అవుతుంది అని నమ్ముతున్నాను` అని చెప్పారు. 


`వాస్తవం` టీజర్‌ ఔట్‌.. ఎలా ఉందంటే?..

మేఘశ్యాం, రేఖ నిరోష హీరో హీరోయిన్లుగా అంజనిసూట్ ఫిలిమ్స్ సంస్థ పై ఆదిత్య ముద్గల్ నిర్మాతగా జీవన్ బండి దర్శకత్వంలో వస్తున్న సినిమా `వాస్తవం`. ఈ సినిమాకి పెద్దపల్లి రోహిత్ (పి. ఆర్) మ్యూజిక్ అందించారు. ఈ మూవీ టీజర్‌ తాజాగా విడులైంది. టీజర్‌ ఆద్యంతం కట్టిపడేస్తుంది. లవ్‌, రొమాన్స్, థ్రిల్లర్‌ ఎలిమెంట్లతో సాగుతూ ఆకట్టుకుంది. సినిమాపై అంచనాలు పెంచింది. ఈ టీజర్‌ ఈవెంట్‌లో  నిర్మాత ఆదిత్య ముద్గల్ మాట్లాడుతూ, డైరెక్టర్ జీవన్ చెప్పిన కథ తీసిన విధానం చాలా బాగుంది. హీరో మేఘశ్యాం హీరోయిన్ రేఖా నిరోషా చాలా బాగా నటించారు. పి. ఆర్ అందించిన మ్యూజిక్ కి చాలా మంచి స్పందన లభిస్తోంది. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని ప్రేక్షకులు ఆశీస్సులు ఎప్పుడూ మాపై ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు.

దర్శకుడు జీవన్ బండి మాట్లాడుతూ : ఈ కథ నేను చెప్పినప్పుడు నన్ను నమ్మి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్ ఆదిత్య గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సినిమాలో చేసిన ప్రతి చిన్న క్యారెక్టర్ గుర్తుండిపోతుంది. నా టెక్నీషియన్స్ అందరూ ఆర్టిస్టులు నాకు చాలా సపోర్ట్. పి. ఆర్ అందించిన మ్యూజిక్ చాలా బాగా వచ్చింది. హీరో మేఘశ్యాం హీరోయిన్ రేఖ నిరోషా చాలా బాగా నటించారు. కచ్చితంగా ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుందన్నారు.

హీరోయిన్ రేఖ నిరోషా మాట్లాడుతూ : మా సినిమా లో చాలా మంచి కంటెంట్ ఉంది కాని సరైన సపోర్ట్ లేదు. మీడియా ప్రేక్షకులే మాకు సపోర్ట్. అందరికీ నచ్చే కథ అవుతుంది` అని తెలిపింది. హీరో మేఘశ్యాం మాట్లాడుతూ , `నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం. కాలేజ్ నుంచే థియేటర్ ఆర్ట్స్ చేయడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఈ సినిమాతో మీ ముందుకు రాబోతున్నాను. ఎక్కడ కథ నుంచి డివియేట్ అవ్వకుండా చాలా బాగా కథని తీసుకుని వచ్చారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ ఆదిత్య గారికి డైరెక్టర్ జీవన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు` అని చెప్పారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios