Asianet News TeluguAsianet News Telugu

విశ్వక్‌ సేన్‌ `ధమ్కీ` ట్రైలర్‌ 1.0.. సౌండ్‌ సాలిడ్‌గానే ఉంది..!

విశ్వక్‌ సేన్‌ దర్శకత్వం వహిస్తూ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ `ధమ్కీ`. ఈ చిత్ర ట్రైలర్‌ 1.0 వెర్షన్‌ విడుదలైంది. నందమూరి బాలకృష్ణ ఈ ట్రైలర్‌ని విడుదల చేయడం విశేషం.

vishwak sen starrer dhamki trailer 1.0 released solid sounding
Author
First Published Nov 18, 2022, 8:32 PM IST

మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్‌ ఇటీవల `ఓరి దేవుడా` చిత్రంతో డీసెంట్‌ సక్సెస్‌ని అందుకున్నారు. ఇప్పుడు `ధమ్కీ` అంటూ మరో సినిమాతో రాబోతున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. నందమూరి బాలకృష్ణ అతిథిగా ఈ ట్రైలర్‌ని విడుదల చేశారు. హైదరాబాద్‌లోని ఏఎంబీ మల్టీఫ్లెక్స్ లో ఈ ట్రైలర్‌ ఈవెంట్ జరిగింది. ఇక తాజాగా విడుదలైన ట్రైలర్‌ దుమ్ము రేపేలా కనిపిస్తుంది. సౌండింగ్‌ మాత్రం అదిరిపోయింది. 

రావు రమేష్‌ వాయిస్‌ ఓవర్‌తో, ఆయన సీన్లతో ట్రైలర్‌ ప్రారంభమవుతుంది. ఆరేళ్ల వయసున్న కంపెనీ, పదివేల కోట్ల టర్నోవర్‌. ఇవన్నీ ఒక్క రాత్రిలో స్టేట్‌లో పడిపోయాయి. సాయానికి ఒక్క గడ్డిపోచైనా దొరక్కపోతుందా? ఆదుకునేందుకు ఒక్క మనిషైనా దొరక్క పోతాడా? అని ఆయన చెప్పగా, సర్‌ నేను రెడీ అని విశ్వక్‌ సేన్‌ ఎంట్రీ ఇవ్వడం బాగుంది. విశ్వక్‌ ఇందులో వెయిటర్‌గా కనిపిస్తాడు. ఎనర్జిటిక్‌ వెయిటర్‌గా విశ్వక్‌ ఆద్యంతం రచ్చ చేస్తుంటాడు. తన జాబ్‌ ని రఫ్ఫాడిస్తుంటాడు. 

కోప్పడకండి మీరు అడ్డదిడ్డంగా రిచ్‌ అని హీరోయిన్‌ నివేదా పేతురాజ్‌ ఎంట్రీ ఇస్తుంది. ఈ రోజైనా ఆ అమ్మాయికి నిజం చెప్పురా, మనం వెయిటర్లమని అని తన ఫ్రెండ్‌ చెప్పడం, కట్‌ చేస్తే ఒక్క పది రోజులు వాడి స్థానంలో ఉండి వాడి బాధ్యతలు తీసుకోవాలి. ఈ కంపెనీని, ఫ్యామిలీని కాపాడిన వాడివి అవుతావ్‌ అని రావు రమేష్‌ చెప్పడంతో కంపెనీ బాధ్యతలు తీసుకుని అన్నీ సెట్‌ చేయడం వంటి సన్నివేశాలతో సాగే టైలర్‌ ఆద్యంతం రక్తి కట్టించేలా ఉంది. 

చూడబోతుంటే తనలా ఉండే ఓ బిలియనీర్‌ కొడుకు స్థానంలో విశ్వక్‌ సేన్‌ వెళ్లి వాళ్ల కంపెనీ, ఫ్యామిలీని నిలబెట్టేందుకు ఏం చేశాడనే కథతో ఈ సినిమా సాగుతుందని తెలుస్తుంది. ట్రైలర్‌ చూస్తుంటే ఇంట్రెస్ట్ గా అనిపించినా, కథగా చూస్తే ఇది రొటీన్‌ స్టోరీలానే అనిపిస్తుంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఈ చిత్రంలో హీరోగా నటిస్తూ విశ్వక్‌ సేన్‌ దర్శకత్వం వహించారు. తన సొంత బ్యానర్‌పై తండ్రి కరాటే రాజు నిర్మించారు. ఫిబ్రవరిలో ఈచిత్రం విడుదల కాబోతుంది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, హిందీలోనూ పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించడం విశేషం. 

ఇదిలా ఉంటే ఈ చిత్రానికి ప్రసన్న కథ అందించారు. దర్శకుడు మొదట వేరే. కానీ ఆయన టేకింగ్‌ నచ్చక తొలగించి విశ్వక్‌ సేన్‌ దర్శకుడిగా మారాడు. తన వెర్షన్‌లో మార్పులు చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు తెలుస్తుంది. `ఫలక్‌నూమా దాస్‌`తో హీరోగా, దర్శకుడిగా మెప్పించిన విశ్వక్‌ సేన్‌, మరి ఈ చిత్రంతో మరోసారి సత్తా చాటుతాడా? అనేది చూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios