Asianet News TeluguAsianet News Telugu

#VishwakSen:‘దాస్ కా దమ్కీ’ రిలీజ్ టైమ్ ఫిక్స్,ఎన్ని భాషల్లో అంటే!

కథ ప్రకారం.. హీరో, విలన్ రెండూ విశ్వక్ సేనే. కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ గా అనిపించడంతో తన తండ్రిని నిర్మాతగా పెట్టి సినిమా చేస్తున్నారు ఈ యంగ్ హీరో.  

Vishwak Sen s #Dhamki releasing in Tel, Tam, Mal & Hin in Feb 2023
Author
First Published Nov 17, 2022, 3:20 PM IST

కొన్నిరోజుల క్రితం 'దాస్ కా దమ్కీ' అనే సినిమా అనౌన్స్ చేశారు విశ్వక్ సేన్. ముందుగా ఈ సినిమాకి దర్శకుడిగా నరేష్ కుప్పిలిని తీసుకున్నారు. ఆ తరువాత ఏం జరిగిందో కానీ అతడు ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. దీంతో దర్శకత్వ బాధ్యతలు విశ్వక్ సేన్ చేపట్టారు. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయం బయటకొచ్చింది. అదేంటంటే... ఈ సినిమా పిభ్రవరి 2023 లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. తమిళ,తెలుగు, మళయాళం, హిందీలలో రిలీజ్ చేస్తున్నారు. విశ్వక్సేన్ చిత్రాలతో పోలిస్తే ఇది పెద్ద రిలీజ్ అని చెప్పాలి. 

ఇక ఈ సినిమాలో విశ్వక్ సేన్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. అందులో ఒకటి హీరో రోల్ కాగా.. మరొకటి విలన్ రోల్ అని సమాచారం. కథ ప్రకారం.. హీరో, విలన్ రెండూ విశ్వక్ సేనే. కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ గా అనిపించడంతో తన తండ్రిని నిర్మాతగా పెట్టి సినిమా చేస్తున్నారు ఈ యంగ్ హీరో.  ఈ సినిమాలో నివేతా పేతురేజ్ హీరోయిన్ గా నటిస్తుండగా.. లియోన్ జేమ్స్ సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి దినేష్ బాబు ఛాయాగ్రాహకుడు. ప్రసన్న కుమార్ బెజవాడ కథ అందించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

 
విశ్వక్ సేన్ కి దర్శకత్వం అయితే కొత్త కాదు. అతను ఇంతకముందు ‘ఫ‌ల‌క్‌నుమా దాస్’ అనే సినిమా తీశాడు. అది మలయాళ సినిమా ‘అంగామ‌లై డైరీస్‌’కు రీమేక్. దాన్ని హైదరాబాద్ నేపథ్యంలో విశ్వక్ సేన్ బాగానే తీశాడు. ఈ సినిమా ఓ బాగా ఆడింది.  విశ్వక్ సేన్ మిగతా విషయాలనికొస్తే.. అతడు నటించిన ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమా విడుదల అయ్యింది. ఆ సినిమా బాగానే ఆడింది. రీసెంట్ గా దీపావళికు రిలీజైన ఓ మైగాడ్..చిత్రం మాత్రం వర్కవుట్ కాదు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios