మాస్‌ సినిమాలతో విజయాలు అందుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతున్నాడు విశ్వక్‌ సేన్‌. ఇప్పుడు రూట్ మార్చి `గామి` పేరుతో ఓ థ్రిల్లర్‌ మూవీ చేశాడు.  టీజర్‌ క్రేజీగా ఉంది.

మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్‌ త్వరలో `గామి` చిత్రంతో రాబోతున్నారు. చాలా కాలం క్రితమే ప్రారంభమైన మూవీ ఇది.ఇప్పుడు విడుదలకు సిద్ధమయ్యింది. వచ్చే నెలలో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. విద్యాధర్‌ కాగిత దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఇటీవల ఈ మూవీకి సంబంధించిన మేకింగ్‌ వీడియోని విడుదల చేశారు. అది ఆసక్తిని రేకెత్తించింది.ఇప్పుడు టీజర్‌ని విడుదల చేశారు. గామిలోని క్యారెక్టర్స్ ని పరిచయం చేస్తూ ఈ టీజర్ సాగింది.

పీరియడ్‌ అంశాలతో టీజర్‌ ప్రారంభమైంది. ఓ మ్యాప్‌ని ఓపెన్‌ చేసి ఇదే ఈ సమస్యకి పరిష్కారం అనే వాయిస్‌తో టీజర్‌ సాగింది. కొందరు నగ్నంగా స్నానం చేస్తున్నారు. వణికిపోతున్నారు. మరోవైపు నటి అభినయ సైతం స్నానం చేస్తూ కనిపించింది. ఆ తర్వాత కాశీలో చాందిని ఫోటోలు తీస్తూ కనిపించింది. ఆ తర్వాత ఒక్కో పాత్ర రివీల్‌ అవుతుంది. దేన్నో వెతుకున్నారు. ఏదో చూసి ఆశ్చర్యపోతున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి శంకర్‌ అని పిలవగా, నల్లటి దుప్పటి కప్పుకుని కర్ర పట్టుకుని ఉన్న విశ్వక్‌ సేన్‌ లుక్‌ రివీల్‌ అయ్యింది. అనంతరం ఇవన్నీ దాటుకుని నా వల్ల అవుతుందంటారా అని విశ్వక్‌ సేన్‌ అంటాడు. మంచు పర్వతాల్లో సాహసం చేస్తుంటారు.

చివరగా టైటిల్‌ రివీల్‌ అవుతుంది. అయితే బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ థ్రిల్లర్‌ని తలపిస్తుంది. ఆసక్తిని క్రియేట్‌ చేస్తుంది. అదే సమయంలో ఉత్కంఠకి గురి చేస్తుంది. ఎలాంటి హంగులు ఆర్బాటాలు లేకుండా కంటెంట్ ని చూపించే ప్రయత్నం చేశాడు. బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ మాత్రం గూస్‌ బంమ్స్ తెప్పిస్తుంది. ఏదో సస్పెన్స్ అంశాలను ఈ మూవీలో చర్చించబోతున్నట్టు ఓ కొత్తరకమైన కథని చెప్పబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ మూవీ ట్రైలర్‌ని ఈ నెల 29న విడుదల చేయబోతున్నారు. 

YouTube video player

విశ్వక్‌ సేన్‌తోపాటు ఛాందిని చౌదరి, అభినయ, మోహ్మద్‌ షమద్‌, హారిక పేదడ, దయానంద్‌ రెడ్డి, శాంతి రావు వంటి వారు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వీ సెల్యూలాయిడ్‌ నిర్మిస్తున్న మూవీ ఇది. కార్తిక్‌ సబరీష్‌ నిర్మాత. ఈ మూవీని మార్చి 8న విడుదల చేయబోతున్నారు. అదే డేట్ కి విశ్వక్‌ సేన్‌ `గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి` రిలీజ్‌ కావాల్సి ఉంది. కానీ దాన్ని వాయిదా వేస్తున్నట్టు తెలుస్తుంది.

Read more: పవన్‌ ఎలివేషన్లు, పవర్‌ఫుల్‌ డైలాగులు..`ఓజీ`లో హైలైట్‌ పార్ట్ అదే.. థియేటర్లు దద్దరిల్లాల్సిందే?