విశ్వక్ సేన్ ‘గామీ‘ సినిమా నుంచి ఈరోజు మొదటి పాటలై విడుదలై ఆకట్టుకుంటోంది. అలాగే ‘రికార్డు బ్రేక్’ మూవీ హీరో ఇంటర్వ్యూ ముచ్చట్లు ఆసక్తికరంగా మారాయి. 

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ త్వరలో ‘గామీ’ (Gaami) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో యంగ్ హీరో బిజీగా ఉన్నారు. ఇప్పటికే చిత్ర ట్రైలర్ విడుదలై ఆకట్టుకుంది. Gaami చిత్రం అడ్వెంచర్, థ్రిల్లర్ డ్రామాగా రూపుదిద్దుకుంటోంది. యూవీ క్రియేషన్స్, కార్తీక్ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని కార్తీక్ శబరీశ్ నిర్మించారు. విద్యాధర్ దర్శకత్వం వహిస్తున్నారు. చాందిని చౌదరి Chandini Chowdary హీరోయిన్ గా నటిస్తోంది. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు శివమ్ (Shivam) అనే టైటిల్ తో మొదటి పాటను విడుదల చేశారు. సాంగ్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం మార్చి 8న విడుదల కాబోతోంది. 

YouTube video player


‘రికార్డ్ బ్రేక్’ హీరో నిహిర్ కపూర్ కామెంట్స్... 

పాన్ ఇండియా మూవీ ‘రికార్డ్ బ్రేక్’ (Record Break) మార్చ్ 8న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా హీరో నిహిర్ కపూర్ మీడియాతో ముచ్చటిస్తూ సినిమా గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ.... నేను ముందు గ్యాంగ్ స్టర్ గంగరాజు సినిమా చేశాను. నెక్ట్స్ హీరోగా ఈ సినిమా చేస్తున్నాను. క్యారెక్టర్రైజేషన్ చాలా బాగుండడంతో ఈ కథ ఒప్పుకున్నాను.ఈ కథలో ఇద్దరం అనాథలుగా అడవిలో పెరుగుతూ ఉంటాం. మేము ట్విన్స్. అడవి నుంచి కుస్తీ పోటీలు నేర్చుకుని సిటీకి వచ్చి ఇంటర్నేషనల్ లెవెల్ లో డబ్ల్యూడబ్ల్యూఈ దాకా వెళ్లే ప్రయాణమే ఈ సినిమా కథ. ఇందులో డబ్ల్యూ డబ్ల్యూ పోటీలు చూపిస్తున్నాము. కుస్తీ పోటీల నుంచి డబ్ల్యు డబ్ల్యు ఈ దాకా జరిగే ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంటుంది అనేది మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది.

రాజస్థాన్ హర్యానా లాంటి ప్రాంతాల్లో కుస్తీ పోటీలు ఎక్కువగా జరుగుతాయి ఆ డీటైలింగ్ మీద నార్త్ వాళ్ళు ఎక్కువ సినిమాలు తీస్తారు. కానీ మన సినిమాలో కుస్తీ పోటీలతో పాటు మిగతా ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. ఇది తెలుగు సినిమా అయినా ప్రతి భారతీయుడు చూసి గర్వించదగ్గ సినిమా. ఇలాంటి సినిమా తెలుగుతోనే ఆగిపోకూడదు. అందుకే ఎనిమిది భాషల్లో వరల్డ్ వైడ్ గా సినిమా రిలీజ్ చేస్తున్నాం. ట్రైలర్ చూశాక అమ్మ జయసుధ గారికి చాలా నచ్చిందన్నారు. ఈ కథ నేనే విని ఒకే చేశా యూనిక్ కాన్సెప్ట్ తీసుకున్నావ్ అని మెచ్చుకున్నారు. నేను డైరెక్షన్ కోర్స్ నేర్చుకున్నా.. ఫ్యూచర్లో డైరెక్షన్ డైరెక్షన్ చేస్తాను కాకపోతే దానికి కొంచెం టైం ఉంది. స్క్రిప్స్ రాసుకున్నాను ఓటీటీ కి ఫ్యూచర్ ఫిలిం కి రెండిటికి ట్రై చేస్తున్నాను. టైం సెట్ అయితే కచ్చితంగా చేస్తాను.