నిహారిక నిర్మించిన `కిటీ కుర్రోళ్లు` సినిమా కోసం విశ్వక్‌ సేన్‌ ముందుకు రావడం ఓవిశేషమైతే, `శివం భజే` రిలీజ్‌ డేట్‌ ఫైనల్‌ అయ్యింది.  

మెగా డాటర్‌ నిహారిక నిర్మాతగా మారి ఓ ఫీచర్‌ ఫిల్మ్ ని నిర్మిస్తుంది. `కమిటీ కుర్రోళ్లు` పేరుతో ఈ మూవీని తెరకెక్కిస్తుంది. కొత్త నటీనటులు నటిస్తున్నారు. నిహారికా కొణిదెల సమర్పణలో పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్ ఎల్‌ఎల్‌పీ, శ్రీ రాధా దామోదర్‌ స్టూడియోస్‌ పతాకాలపై పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యదు వంశీ దర్శకుడు. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్‌పూర్తి చేసుకుంది. టీజర్‌ విడుదలై ఆకట్టుకుంది. పాటలుకూడా ఆదరణ పొందుతున్నాయి. తాజాగా సినిమాలోని మరో పాటని విశ్వక్‌ సేన్‌ విడుదల చేశారు. `సందడి సందడ `అంటూ సాగే ఈ పాట శ్రోతలు మెప్పిస్తుంది. 

`సందడి సందడి` అంటూ సాగే ఈ పాటను సింహాచలం మన్నెల రచించగా.. అనుదీప్ దేవ్, రేణూ కుమార్, శ్రీనివాస్ దరిమిశెట్టి ఆలపించారు. అనుదీప్ దేవ్ మంచి ఊపునిచ్చే బాణీని అందించారు. ఈ లిరికల్ వీడియోలోని విజువల్స్, జాతర సన్నివేశాలు, కుర్రాళ్ల ధూంధాం స్టెప్పులు బాగున్నాయి. రాజు ఎడురోలు ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. అన్వర్ అలీ ఎడిటర్‌గా పని చేశారు. ఈ చిత్రానికి వెంకట సుభాష్ చీర్ల, కొండల రావు అడ్డగళ్ల సంభాషణలు రాశారు. ఆగస్టులో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్లు ప్లాన్ చేస్తున్నారు. 

అశ్విన్‌ బాబు `శివం భజే` రిలీజ్‌ డేట్‌ ఫిక్స్..

యాంకర్‌ ఓంకార్‌ తమ్ముడు అశ్విన్‌ బాబు హీరోగా నిలబడే ప్రయత్నం చేస్తున్నారు. సక్సెస్‌ కోసం ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పుడు ఆయన `శివం భజే` చిత్రంలో నటిస్తున్నారు. అప్సర్‌ దర్శకత్వంలో న్యూ ఏజ్‌ డివైన్‌ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు. అశ్విన్‌ బాబు సరసన దిగంగనా సూర్యవంశీ హీరోయిన్‌గా నటిస్తుంది. తాజాగా ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ని ఫిక్స్ చేశారు. ఆగస్ట్ 1న విడుదల చేయబోతున్నట్టు వెల్లడించారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, "వైవిధ్యమైన కథతో, సాంకేతిక విలువలతో మా సంస్థ గంగా ఎంటర్టైన్మంట్స్ నిర్మాణంలో ఆగష్టు 1న విడుదలవ్వనున్న చిత్రం 'శివం భజే'. ఫస్ట్ లుక్ కి, టీజర్ కి అద్భుతమైన స్పందన రావడంతో చిత్ర విజయంపై మాకున్న విశ్వాసం మరింత పెరిగింది. మా హీరో అశ్విన్ బాబు, దర్శకుడు అప్సర్, అర్బాజ్ ఖాన్, సాయి ధీనా, హైపర్ ఆది, మురళీ శర్మ, బ్రహ్మాజీ, తులసి వంటి నటులు, ఇండస్ట్రీ మేటి సాంకేతిక నిపుణుల సహకారంతో మా మొదటి చిత్రం అనుకున్నట్టుగా రూపుదిద్దుకుంది. ప్రస్తుతం నిర్మాణాంతర కర్యక్రమాలు చివరి దశలో ఉండగా ఆగష్టు 1న ప్రపంచవ్యప్తంగా గ్రాండ్ గా విడుదల చేయడానికి సిద్దమవుతున్నాం. శివస్మరణతో మొదలైన మా చిత్రానికి ఆయన ఆశీస్సులతో అద్భుత స్పందన లభించడం చాలా ఆనందంగా ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది. ట్రైలర్ మరియు పాటల విడుదల గురించి వివరాలు త్వరలో వెల్లడిస్తాం' అని అన్నారు.