Asianet News TeluguAsianet News Telugu

`బుట్టబొమ్మ` నేను చేయాల్సింది.. అసలు విషయం బయటపెట్టిన విశ్వక్‌ సేన్‌.. ట్రైలర్‌ ట్రెండింగ్..

`బుట్టబొమ్మ` చిత్రం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ట్రైలర్ ప్లజెంట్‌గా ఉండటంతోపాటు ఫ్రెష్‌గా ఉంది. దీంతో ఇప్పుడిది యూట్యూబ్‌లో ట్రెండింగ్ అవుతుంది. అయితే ఇందులో మొదట హీరోగా  విశ్వక్‌సేన్‌ని అనుకున్నారట. 

vishwak sen first choice for buttabomma movie but what hapeen trailer trending
Author
First Published Jan 29, 2023, 1:30 PM IST

చిన్న చిత్రంగా తెరకెక్కిన `బుట్టబొమ్మ` ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటుంది. తాజాగా విడుదలై ట్రైలర్‌ అందరి చూపులను తనవైపు తిప్పుకుంటుంది. ఇది యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతుంది. ఫ్రెష్‌ లుక్‌లో, విలేజ్‌ బ్రాక్‌ డ్రాప్‌లో సాగే ఈ ఫీల్‌గుడ్‌ మూవీగా తెరకెక్కిన `బుట్టబొమ్మ` ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేస్తుంది. ట్రైలర్ ఆకట్టుకోవడంతోపాటు ట్రెండింగ్ అవుతుంది. విడుదలైన కొన్ని గంటల్లోనే మిలియన్‌ వ్యూస్‌ రాబట్టింది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. 

ఇందులో మొదట హీరోగా నటించాల్సింది మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్‌ అట. శనివారం జరిగిన `బుట్టబొమ్మ` ట్రైలర్‌ ఈవెంట్‌లో ఆయన ఈ విషయం చెప్పారు. `నిజానికి అసలు ఈ `బుట్టబొమ్మ` సినిమాలో నేను నటించాల్సి ఉంది. కానీ డేట్స్ కుదరకపోవడం వల్ల చేయలేకపోయాను. ఇది నాకు చాలా ఇష్టమైన కథ. గుండెల మీద చేతులేసుకుని వచ్చేయొచ్చు ఈ సినిమాకి.. అంత బాగుంటుంది` అని చెప్పారు విశ్వక్‌ సేన్‌. నిర్మాతకి, చిత్ర బృందానికి ఆయన అభినందనలు తెలిపారు.  అంతేకాదు వంశీ నిర్మాణంలో నేను చేయబోయే సినిమాని కూడా త్వరలో ప్రకటిస్తామన్నారు. 

`బుట్టబొమ్మ` నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ, `ఇది ఒక మంచి పల్లెటూరి కథ. ఐదేళ్ల క్రితం `ఉయ్యాల జంపాల` అనే సినిమా చూశాం. అలాంటి సినిమాలో సస్పెన్స్ లు, ట్విస్ట్ లు ఉంటే ఎలా ఉంటుందో.. అలా ఉంటుంది ఈ సినిమా. ఈ మధ్య చిరంజీవి  `వాల్తేరు వీరయ్య`, `బాలకృష్ణ `వీరసింహారెడ్డి ` ఇలా ఎక్కువగా మాస్ సినిమాలు చూశాం. ఇప్పుడు క్లాస్ సినిమా చూస్తారు. సస్పెన్స్ తో కూడిన ఒక క్యూట్ విలేజ్ లవ్ స్టోరీ ఇది. విశ్వక్ సేన్ చెప్పినట్లు త్వరలోనే మా కలయికలో కొత్త సినిమా ప్రకటన వస్తుంది. అందులో విశ్వక్ సేన్ విశ్వరూపం చూస్తారు` అని తెలిపారు. వీరితోపాటు ట్రైలర్‌ ఈవెంట్లో హీరోయిన్‌ అనికా సురేంద్రన్‌,  హీరో సూర్య వశిష్ట, నటి నవ్య స్వామి ఇతర చిత్ర బృందం పాల్గొంది. తమ ఆనందాన్ని తెలియజేశారు.

ట్రైలర్‌ చూస్తే, 'బుట్టబొమ్మ' కథ అరకు ప్రాంతంలో జరుగుతుంది. అరకులోని అందమైన లొకేషన్లను చూపిస్తూ ట్రైలర్ ఆహ్లాదకరంగా ప్రారంభమైంది. ఇందులో అనిఖా సురేంద్రన్ ఒక సాధారణ మధ్యతరగతి యువతిగా కనిపిస్తోంది. చిన్న చిన్న కోరికలు, కొన్ని బాధ్యతలు, వయసొచ్చిన ఆడపిల్ల ఉన్న తండ్రి పడే ఆందోళన మధ్య ఆమె పాత్ర పరిచయమైంది. అనుకోకుండా ఫోన్ ద్వారా ఆమెకు ఆటో డ్రైవర్(సూర్య వశిష్ఠ)తో పరిచయం కావడం, అది ప్రేమ వరకు వెళ్లడం జరుగుతుంది. అయితే ఎంతో హాయిగా సాగిపోతున్న వారి ప్రేమ కథలోకి అర్జున్ దాస్ పాత్ర రాకతో అలజడి మొదలవుతుంది. నేర చరిత్ర, రాజకీయ పలుకుపడి ఉన్న అతను వీరి జీవితాల్లోకి ఎందుకు వచ్చాడు? అతని రాకతో ఈ ప్రేమకథ ఎలాంటి మలుపులు తిరిగింది? అనే ఆసక్తిని రేకెత్తించేలా రూపొందించిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. 

శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకత్వం, వంశీ పచ్చిపులుసు కెమెరా పనితనం, గోపి సుందర్ నేపథ్య సంగీతం ట్రైలర్ ను మరో మెట్టు ఎక్కించాయి. ప్రతి ఫ్రేమ్ ఎంతో అందంగా ఉంది. నేపథ్య సంగీతం సన్నివేశాలకు తగ్గట్లుగా చక్కగా కుదిరింది. గణేష్ రావూరి సంభాషణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. "ఈడొచ్చిన దానివి ఇంట్లో పడుండు.. ఎవడి కంట్లోనూ పడకు", "21వ శతాబ్దంలో ప్రపంచం సంకనాకి పోద్దని బ్రహ్మంగారు చెప్పారు" వంటి సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ భాగస్వామ్యంతో సితార ఎంటర్టైన్మెంట్స్ సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. అర్జున్‌ దాస్‌ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 4న విడుదల కానుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios