'బేబీ' వివాదం: విశ్వక్ సేన్ మళ్లీ ఈ టాపిక్ ఎందుకు తెచ్చారో
బాగుందని ‘డైరెక్టర్స్’ వాట్సాప్ గ్రూప్‌లో ముందుగా మెసేజ్ చేసింది నేనే. అయినా, దర్శకుడిని నేను కలవలేదంటూ మీమ్స్ వచ్చాయి.

సినిమా సక్సెస్ అందుకుంటే తలెత్తుకోవడంలో తప్పులేదని, కానీ తనను కించపరిచినందుకే బాధగా ఉందని యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) అన్నాడు. నిన్న రాత్రి జరిగిన ‘పేకమేడలు’ (Pekamedalu) సినిమా టీజర్ విడుదల వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ఇటీవల జరిగిన కాంట్రవర్సీపై స్పందించాడు. అందరినీ ఆనందంగా ఉంచేందుకు తానేమీ బిర్యానీ కాదంటూ సినిమా, దర్శకుడి పేరుని ప్రస్తావించకుండానే వ్యాఖ్యలు చేశాడు.
‘‘ఎవరి స్థాయిని బట్టి వారు బిజీగా ఉంటాం. ఎలాంటి సినిమాలు చేయాలో స్పష్టత లేనప్పుడు ఎదుటివారి సమయం వృథా చేయకూడదనుకుంటాం. ఆ క్రమంలో ‘కలవలేం, కథ వినలేం’ అని దర్శకుడికి చెబుతుంటాం. దానికి కొంతమంది ఫీలవుతుంటారు. ఆ విషయంలో నేనేం చేయలేను. అందరినీ ఆనందంగా ఉంచేందుకు నేను బిర్యానీని కాదు. మన సినిమా విజయవంతమైతే తలెత్తుకోవడంలో తప్పులేదు. కానీ, సినిమా బాగుందని కించపరచొద్దు. అదొక్కటి బాధగా ఉంది. చిన్న సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతుండడం అందరూ సంతోషించే విషయం. ఆ చిత్ర టీమ్ కి నేను శుభాకాంక్షలు కూడా చెప్పా. సినిమా ట్రైలర్ బాగుందని ‘డైరెక్టర్స్’ వాట్సాప్ గ్రూప్‌లో ముందుగా మెసేజ్ చేసింది నేనే. అయినా, దర్శకుడిని నేను కలవలేదంటూ మీమ్స్ వచ్చాయి. గంట చర్చించి నో చెప్పడం కంటే ముందే చెప్పడం బెటర్ అనుకుని చెప్పా’’ అని వివరించాడు.
వివాదం ఏంటంటే?:
రీసెంట్ గా విడుదలైన బేబి సినిమా దర్శకుడు ప్రచారంలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఆ చిత్ర కథను ముందుగా ఓ హీరోకి వినిపించేందుకు ప్రయత్నించగా కలిసేందుకు కూడా ఆసక్తి చూపించలేదని తెలిపాడు. అదే సమయంలో విశ్వక్ ట్వీట్ పెట్టాడు. ఆ దర్శకుడికి కౌంటర్ ఇచ్చేందుకే ఈ హీరో ట్వీట్ చేశాడంటూ వార్తలొచ్చాయి. అలా నెట్టింట వివాదం రాజుకుంది.
అయితే బేబి దర్శకుడు సైతం ఫలానా హీరో అని ప్రస్తావించలేదు. కానీ విశ్వక్సేన్ ట్వీట్ చేయటంతో ఫలానా అని చాలా మందికి తెలిసింది. లేకపోతే తెలిసేదే కాదు. ఆ ట్వీట్ తర్వాత బేబి డైరక్టర్ కూడా ఏమీ స్పందించలేదు. కానీ విశ్వక్సేన్ మాత్రం మరో సారి ఆ ప్రస్తావన తెచ్చారు.
ఇక ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత రాకేశ్ వర్రే మాట్లాడుతూ, `హీరోగా నేను చేసిన ఎవరికి చెప్పొద్దు’ వచ్చిన మూడేళ్లకు ఈ సినిమా చేశారు. అయితే నిర్మాతగా ఈ సినిమా చేశా. నా మొదటి సినిమాకు ఎవరైతే సాయం చేస్తాననుకున్నానో వారు చేయలేదు. అప్‌కమింగ్ డైరెక్టర్స్ శశికిరణ్ తిక్కా, రాహుల్ సంక్రిత్యన్, తరుణ్ భాస్కర్‌లతోపాటు సుకుమార్, కొరటాల శివ వంటి దర్శకులు సపోర్ట్‌తో ఆ సినిమా విడుదల చేయగలిగా. మూడు రోజుల్లో తీసేయాల్సిన సినిమా 30 రోజులు ఆడింది. ఇప్పుడు అదే సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో పాపులర్ సినిమాలో ఒకటిగా నిలిచింది. తర్వాత నేనేం చేయాలని ఆలోచిస్తున్న తరుణంలో ‘స్నేహితుడి ద్వారా ‘పేక మేడలు’ కథ వచ్చింది. నచ్చి నేను హీరోగా కాకుండా నిర్మాతగా ఈ సినిమా మొదలుపెట్టా. హైదరాబాద్‌లోని ఓ బస్తీలో సాగే కథ ఇది. ఈ సినిమాకు వర్క్‌షాప్ చేశాం.
విష్వక్ గెస్ట్‌గా ఎందుకనే ప్రశ్న ఎదురైంది. తన కమిట్‌మెంట్ నాకు ఇష్టం. ప్రారంభంలోనే తను ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. స్టార్ కావాలని అందరూ అనుకుంటారు. ‘ఫలక్‌నుమా దాస్’ చిత్రంతో తనని తానే స్టార్ చేసుకున్నాడు. ఎవరు అతన్ని స్టార్‌ని చేయలేదు. విశ్వక్‌తో మొదటి సినిమా చేసిన యాకుబ్ ఇప్పుడు నాతో సినిమా చేస్తున్నాడు. విష్వక్‌గా డెడికేటింగ్ చేయాలి అని వర్క్‌షాప్‌లో యాకుబ్ తరచూ చెబుతుండేవాడు. నేను అదే ఫాలో అయ్యా. ఇప్పుడు నేను పిలవగానే కాదనుకుండా టీజర్ రిలీజ్‌కి వచ్చాడు. ఈ చిత్రానికి వినోద్, అనూష యాప్ట్. వాళ్లిద్దరిమీదే సినిమా నడుస్తుంది. ఉత్తమ ఆర్టిస్ట్ కూడా వచ్చేంతగా యాక్ట్‌చేశారు.
దర్శకుడు నీలగిరి మాట్లాడుతూ ‘‘
చైల్డ్ ఆర్టిస్ట్‌గా చాలా సినిమాలు చేశా. దీక్షితులుగారు మా మాస్టర్. యాక్టింగ్ స్కూల్‌లో ఉన్నప్పుడే దర్శకత్వంపై ఆసక్తి ఉండేది. అనీస్ కురువిళ్లా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశా. అప్పుడే ఈ కథ నా మనసులో మెదిలింది. బస్తీ లైఫ్ ఎలా ఉంటుంది. అక్కడ ఎవరు పేక మేడలు కడతారు అన్న కాన్సెప్ట్‌తో ఈ చిత్రం చేశాం. ప్రతి ఒక్కరికీ జీవితంలో ఎదురయ్యే కథ ఇది. ఇలాంటి కథ బయటకు వెళ్తే బజ్ క్రియేట్ అవుతుందని నమ్మి చేశాం.రాకేశ్‌గారు విన్న వెంటనే నిర్మాతగా ఓకే అన్నారు. అలాగే మంచి టీమ్ కుదిరింది. హీరోహీరోయిన్లు యాప్ట్ అయ్యారు.
వినోద్ మాట్లాడుతూ ‘‘పేక మేడలు’ చిత్రంలో నేను చేసిన పాత్ర ఎప్పటికీ ప్రత్యేకంగా నిలుస్తుంది. సెకెండ్ లాక్‌డౌన్‌లో నాకు వచ్చిన ఆఫర్ ఇది. సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఈ మెసేజ్ చూసి ఫేక్ అనుకున్నా. బట్ ప్రయత్నం చేశా. సినిమాలో భాగం అయ్యా. ఈ సిననిమా జర్నీ బ్యూటిఫుల్‌గా సాగింది. తెలుగు సినిమాలో నాన్ తెలుగు హీరోని తీసుకోవడం అంటే ఎంతో నమ్మకం ఉండాలి’’ అని అన్నారు. హీరోయిన్ అనుష సినిమాలో అవకాశం పట్ల ఆనందం వ్యక్తం చేసి సినిమా సక్సెస్ కావాలని అభిలాషించారు.