Asianet News TeluguAsianet News Telugu

సినిమాకి ఎంత బడ్జెట్‌ అనేది కాదు, టాలెంట్‌ చూడాలి.. విశ్వక్‌సేన్‌ చురకలు..

సినిమాకి ఎంత బడ్జెట్‌ పెడుతున్నారు, ఎంత ఎక్కువ పెడుతున్నారనేది చూస్తుంటారు. కానీ చూడాల్సింది బడ్జెట్‌ కాదు, అందులో పనిచేస్తున్న వారి టాలెంట్‌ అని అన్నాడు యంగ్‌ హీరో, మాస్‌ కా దాస్‌ విశ్వక్‌సేన్‌. 

vishwak sen bold comments on movie budget at ramanna youth movie event arj
Author
First Published Sep 12, 2023, 11:56 PM IST

చాలా వరకు సినిమాకి ఎంత బడ్జెట్‌ పెడుతున్నారు, ఎంత ఎక్కువ పెడుతున్నారనేది చూస్తుంటారు. కానీ చూడాల్సింది బడ్జెట్‌ కాదు, అందులో పనిచేస్తున్న వారి టాలెంట్‌ అని అన్నాడు యంగ్‌ హీరో, మాస్‌ కా దాస్‌ విశ్వక్‌సేన్‌. చరిత్ర సృష్టించే సినిమాలకు ఎంబడ్జెట్‌ ఇంత ఉండాలనే అవసరం లేదని, ఆ విషయాన్ని `పెళ్లి చూపులు`, `అర్జున్‌రెడ్డి`, `బలగం`, `మసూద`, `ఫలక్‌నూమా దాస్‌ `వంటి చిత్రాలు నిరూపించాయన్నారు. బడ్జెట్‌ కాకుండా సినిమాకి పనిచేస్తున్న వారి టాలెంట్‌ ముఖ్యమని, అదే సినిమాకి పెద్ద బలం. `రామన్న యూత్‌` సినిమాకి అలాంటి మ్యాజిక్‌ జరగాల`ని తెలిపారు. 

విశ్వక్‌ సేన్‌ `రామన్న యూత్‌` అనే చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కి గెస్ట్ గా వెళ్లాడు. నటుడు అభయ్‌ నవీన్‌ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రమిది. విలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌లో సాగే కామెడీ పొలిటికల్‌ డ్రామా చిత్రమిది. ఫైర్‌ ఫ్లె ఆర్ట్స్ నిర్మిస్తుంది. ఈ నెల 15న సినిమా విడుదల కానుంది. విడుదలైన ట్రైలర్‌,టీజర్లు ఆకట్టుకున్నాయి. సోమవారం చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించారు. ఇందులో జానపద నేపథ్యంలో వచ్చే ఓ సాంగ్‌ని ప్రదర్శించారు. అది ఆద్యంతం ఆకట్టుకుంది. మరోవైపు విలేజ్‌ పొలిటికల్‌ స్కిట్‌ని ప్రదర్శించగా అలరించింది. 

ఇక గెస్ట్ గా వచ్చిన విశ్వక్‌ సేన్‌ మాట్లాడుతూ, `నా సినిమా ప్రదర్శించే థియేటర్ దగ్గరకు వెళ్లి టికెట్ మీద ఆ సినిమా పేరు చూడాలనుకునేవాడిని. `ఈ నగరానికి ఏమైంది` సినిమా రిలీజ్ అయినప్పుడు దేవి థియేటర్ కు వెళ్లి వంద టికెట్స్ కొని వాటిని చూసుకుని సంతోషపడ్డాను. మా `ఫలక్ నుమా దాస్` సినిమా ఆడిషన్ కు అభయ్ వచ్చాడు. అప్పుడు ఆడిషన్ కు వచ్చిన వారిలో అభయ్ సీనియర్. సీనియర్ అని జాగ్రత్తగా ఆడిషన్ తీసుకున్నా` అని చెప్పారు. `రామన్న యూత్‌ గురించి చెబుతూ, పొలిటికల్ నాలెడ్జ్ రూరల్ యూత్ కు ఎక్కువగా ఉంటుంది. క్రికెట్, పొలిటికల్ నాలెడ్జ్ వారికే ఎక్కువ ఉంటుంది. అలాంటి ఫ్లేవర్ ఈ సినిమాలో తీసుకొచ్చాడు అభయ్. ఈ సినిమాకు డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో  కొంతమంది మహిళలు పనిచేశారని విన్నాను. అమ్మాయిలు ఇండస్ట్రీకి రండి. బాలీవుడ్ లో చాలా మంది ఉమెన్ సినిమాకు వర్క్ చేస్తారు. మీరు సెట్ లో ఉంటే అబ్బాయిలకు మోటివేషన్ ఉంటుంది. ఈ నెల 15న రామన్న యూత్ సినిమా చూడండి. మీకు తప్పకుండా నచ్చుతుంది` అని అన్నారు.

హీరో, దర్శకుడు అభయ్ నవీన్ మాట్లాడుతూ, `మాది సిద్ధిపేట. నాన్న మ్యాథ్స్ టీచర్. సినిమాల్లోకి నేను వెళ్లడం ఇంట్లో ఎవరికీ ఇష్టం లేదు. రిలేటివ్స్ మీ వాడు సినిమాలంటూ తిరుగుతున్నాడు అని కంప్లైంట్స్ చెప్పేవాళ్లు. సినిమా తీయాలనేది నా కల. నా పట్టుదల చూశాక ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఎంతో సపోర్ట్ చేయడం ప్రారంభించారు. వీళ్లంతా నన్ను నమ్మకపోతే నేను సినిమా చేయగలిగే వాడిని కాదు. `బొమ్మలరామారం` సినిమా టైమ్ నుంచి ప్రియదర్శి, తిరువీర్ పరిచయం. ప్రియదర్శి చెబితే పెళ్లి చూపులు ఆడిషన్స్ వెళ్లా. డైరెక్టర్ తరుణ్ భాస్కర్ నువ్వు సెలెక్ట్ అయ్యావు అని చెప్పినా నేను నమ్మలేదు. కానీ ఆ సినిమాలో అవకాశం వచ్చింది. ఇప్పటికీ నన్ను కొందరు `పెళ్లి చూపులు` సినిమాలోలాగ యూకలిప్టస్ అని పిలుస్తుంటారు. అభయ్ అని కొందరు, నవీన్ అని కొందరు అంటారు.

నా వెనక ప్రియదర్శి, తిరువీర్, తరుణ్ భాస్కర్, జీవన్ రెడ్డి, పవన్ సాధినేని లాంటి వాళ్లంతా ఉన్నారనే ధైర్యంతో రామన్న యూత్ స్టార్ట్ చేశాను. ఈ సినిమా ప్రొడ్యూసర్స్ కు స్క్రిప్ట్ ఇస్తే చదవలేదు. వన్ లైన్ ఆర్డర్ ఇచ్చినా చదవలేదు. సినిమా పూర్తయ్యాక స్క్రీన్ మీద చూశారు. ఆ ప్రొడ్యూసర్ ఎవరో ఎవరికీ తెలియదు. ఆయనకు మంచి సినిమా చేయాలి అనేది మాత్రమే తెలుసు. నా టీమ్ నాకు పెద్ద బలం. ముందు సినిమా చేయి అన్నా అనేంత సపోర్ట్ ఇచ్చారు. వారందిరికీ నా థాంక్స్ చెబుతున్నా. మా ఫంక్షన్ కు రావాలని అడగగానే విశ్వక్ వెంటనే రిప్లై ఇచ్చాడు. ఆయనది గోల్డెన్ హార్ట్. మా లాంటి చిన్న సినిమాకు ఎంకరేజ్ మెంట్ ఇవ్వాలని ఆయన ఇక్కడకు వచ్చారు. ఇలాంటి వాళ్లుంటే ఎంతోమంది కొత్త వాళ్లకు సపోర్ట్ దొరుకుతుంది. 

విశ్వక్ కు థాంక్స్ చెబుతున్నా. మంచి సినిమా చేశామనే ధైర్యాన్ని మాకు మొదట ఇచ్చింది సిల్లీ మాంక్స్ అనిల్ అన్న. మా సినిమాకు ఇలా ప్రీ రిలీజ్ చేసి, రిలీజ్ డేట్ అనౌన్స్ చేసుకోవడమే పెద్ద సక్సెస్. ప్రేక్షకులకు చిన్న సినిమా పెద్ద సినిమా అనేది తెలియదు. మంచి కథ ఉంటే సినిమా తప్పకుండా చూస్తారు. ఈ నెల 15 నా లైఫ్ లో స్పెషల్ డే. ఆ రోజును మా నాన్నకు అంకితఇస్తా. ఇక రామన్న యూత్ సినిమా మీ చేతుల్లోకి వచ్చేసింది. ట్రైలర్ నచ్చితే అందరికీ షేర్ చేయండి. మా సినిమాను థియేటర్ లో చూసి ఎంకరేజ్ చేయండి` అని అన్నారు. ఈ కార్యక్రమంలో తిరువీర్‌, ప్రియదర్శి, తాగుబోతు రమేష్‌, కమెడియన్‌ యాదమ్మ రాజు, అనిల్‌ గీల, హీరోయిన్‌ అమూల్యరెడ్డితోపాటు చిత్ర బృందం పాల్గొని  సినిమా పెద్ద విజయం సాధించాలన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios