మొత్తానికి మెగాభిమానులు ఎదురుచూస్తున్న క్షణాలు వచ్చేసాయి. ఉప్పెన చిత్రం రిలీజ్ డేట్ ని నిర్మాణ సంస్ధ అఫీషియల్ గా ఎనౌన్స్ చేసేసింది. ఈ మేరకు మేత్రీమూవీస్ వారు ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు.

మెగా ఫ్యామిలీనుంచి వస్తున్న మరో యంగ్ హీరో వైష్ణవ్ తేజ్. ఈ యంగ్ హీరో ఉప్పెన సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టనున్నాడు. మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించగా.. యంగ్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయ్యింది.

కరోనా అడ్డురాకుండా ఉండి ఉంటే ఈ మూవీ ఈపాటికి ప్రేక్షకుల ముందుకు వచ్చేసేది. లాక్ డౌన్ టైం లో చాలా సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి కానీ’ఉప్పెన’ మాత్రం ఓటీటీకి నో చెప్పింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు శ్రోతలను ఆకట్టుకున్నాయి. ఈ నేపద్యంలో ఈ చిత్రం రిలీజ్ డేట్ ని నిర్మాతలు ప్రకటించారు. పిబ్రవరి 12 న ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. ఈ మేరకు చిన్న వీడియోతో సర్పైజ్ చేసారు నిర్మాతలు. పడవలో మోసుకుని రిలీజ్ డేట్ పోస్టర్ ని వస్తున్న హీరోతో ఈ వీడియో ఉంటుంది. 

అందమైన ఈ ప్రేమ కథ ప్రేక్షకులను తప్పకుండ మెప్పిస్తుందని మంచి హిట్ అందుకుంటుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకి థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 18 – 20 కోట్లు చేయాల్సిన అవసరం ఉందని.. అలా చేస్తేనే సినిమాకి పెట్టిన పెట్టుబడి వర్క్ అవుట్ అవుతుందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. 

 మైత్రీ మూవీస్‌ మేకర్స్‌ పతాకంపై నిర్మితమవుతున్నఈ చిత్రాన్నిబుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్. ఈ సినిమాకి సంబంధించి విడుదలైన ‘‘నీ కన్ను నీలి సముద్రం నా మనసేమే అందుట్లో పడవ ప్రయాణం’’ సాంగ్‌ ఆకట్టుకుంటోంది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ఇందులో విజయ్‌ సేతుపతి - రాయమన్‌ అనే పాత్రలో విలన్ గా దర్శనమివ్వనున్నారు. చిత్రానికి నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌, సుకుమార్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.