స్టార్ హీరో, తమిళ నడిగర్ సంఘం అధ్యక్షుడు విశాల్ త్వరలోనే పెళ్లి చేసుబోతున్నట్లు అతడి తండ్రి జికె రెడ్డి అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ అయింది.

హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్, విశాల్ లు ప్రేమించుకుంటున్నారని, పెళ్లి కూడా చేసుకుంటారనే వార్తలు జోరుగా వినిపించిన క్రమంలో విశాల్ మరో అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడని తెలియడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు.

ఈ ఏడాదిలోనే విశాల్ పెళ్లి జరగనుంది. త్వరలోనే ఈ జంటకి ఎంగేజ్మెంట్ జరగబోతుంది. దీంతో అమ్మాయి వివరాలు, ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఆసక్తి జనాల్లో కలిగింది. ఇప్పుడు ఆమె ఫోటో బయటకి వచ్చింది. ఆమె పేరు అనీషా.. హైదరాబాద్ కి చెందిన విజయ్ రెడ్డి,పద్మజ దంపతుల కుమార్తె. విజయ్ రెడ్డి వ్యాపారవేత్త.

ఇలా ఇలా ఉండగా.. నడిగర్ సంఘం భవనం పూర్తయిన తరువాతే పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేశాడు. ఏప్రిల్ నాటికి భవనం నిర్మాణ పనులు పూర్తి కానున్నాయి. ఈలోగా  నిశ్చితార్ధం జరిపి పెళ్లి డేట్ ని ఫైనల్ చేయనున్నారు. 

తెలుగమ్మాయితో హీరో విశాల్ పెళ్లికి రెడీ..!