శ్రీరెడ్డిని అంత ఈజీగా వదలడేమో..!

vishal to fight against actress srireddy
Highlights

నాని విషయంలో శ్రీరెడ్డి చేసిన ఆరోపణల సంగతి తనముందు ప్రస్తావనకు వచ్చినప్పుడే విశాల్.. శ్రీరెడ్డిపై సీరియస్ అయ్యాడు. ఎలాంటి అధరాలు లేకుండా నోటికొచ్చినట్లు ఎలా మాట్లాడతారు అంటూ తన అసహనాన్ని వ్యక్తం చేశాడు

కాస్టింగ్ కౌచ్ పై పోరాటమంటూ వెలుగులోకి వచ్చిన శ్రీరెడ్డి తనను చాలా మంది మోసం చేశారంటూ  ఆరోపణలు చేయడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో చాలా మంది హీరోలు, దర్శకులపై నోటికొచ్చినట్లు కామెంట్లు చేసింది. ఒక స్టేజ్ వరకు ఆమెను భరించిన టాలీవుడ్ ఇప్పుడు పూర్తిగా పక్కన పెట్టేసింది. దీంతో తన ఉనికిని కాపాడుకోవడం కోసం కోలీవుడ్ తారలు కూడా తనను మోసం చేశారంటూ కొత్త కథ ప్రారంభించింది.

ఈ క్రమంలో డైరెక్టర్ సుందర్ సి, రాఘవ లారెన్స్, శ్రీకాంత్, మురుగదాస్ వంటి తారల పేర్లు చెప్పింది. వీరంతా తనకు అవకాశాలు ఇప్పిస్తానని వాడుకున్నట్లు పలు ఇంటర్వ్యూలలో చెప్పడం స్టార్ట్ చేసింది. టాలీవుడ్ లైట్ తీసుకున్నప్పటికీ కోలీవుడ్ మాత్రం ఈ విషయాన్ని  సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం. నాని విషయంలో శ్రీరెడ్డి చేసిన ఆరోపణల సంగతి తనముందు ప్రస్తావనకు వచ్చినప్పుడే విశాల్.. శ్రీరెడ్డిపై సీరియస్ అయ్యాడు.

ఎలాంటి అధరాలు లేకుండా నోటికొచ్చినట్లు ఎలా మాట్లాడతారు అంటూ తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. అలాంటిది ఈసారి ఏకంగా కోలీవుడ్ ఇండస్ట్రీనే టార్గెట్ చేసిన శ్రీరెడ్డిని విశాల్ ఎలా ఎదుర్కోబోతున్నాడనేది ఇప్పుడు ఆసక్తిగ మారింది. ఇప్పటికే విశాల్ ఆమెపై ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనే దానిపై చర్చలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. నడిగర్ సంఘం తరఫున విశాల్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి! 

loader