సంక్రాంతి రేసు నుండి తప్పుకున్నారు!

First Published 13, Dec 2017, 5:30 PM IST
vishal postpones his Abhimanyu till next republic day
Highlights

 సంక్రాంతి బరి నుండి రెండు సినిమాలు బయటకు వచ్చేస్తున్నాయి.

వచ్చే ఏడాది సంక్రాంతి రేసులో దిగాలని చాలా మంది హీరోలు ప్లాన్ చేసుకున్నారు. ముందుగా పవన్ కల్యాణ్ జనవరి 10న 'అజ్ఞాతవాసి' విడుదల చేస్తున్నామంటూ కర్చీఫ్ వేసేశారు. ఆ తరువాత లిస్ట్ లో బాలయ్య తన 'జై సింహా'తో రెడీగా ఉన్నాడు. ఇక మాస్ మహారాజ రవితేజ.. విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో నటిస్తోన్న 'టచ్ చేసి చూడు' చిత్రాన్ని జనవరి 13న విడుదల చేస్తున్నట్లు ప్రకటించాడు. అలానే యంగ్ హీరో రాజ్ తరుణ్ 'రాజు గాడు' చిత్రాన్ని సంక్రాంతి బరిలో దింపే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ నాలుగు సినిమాలు మాత్రమే కాకుండా రెండు డబ్బింగ్ సినిమాలు కూడా రెడీ అయ్యాయి. ఒకటి సూర్య నటిస్తోన్న 'గ్యాంగ్', అలానే విశాల్ నటిస్తోన్న 'అభిమన్యుడు' చిత్రాలు. అయితే ఇప్పుడు ఈ లిస్ట్ నుండి రెండు సినిమాలు వెనక్కి వెళ్తున్నట్లు తెలుస్తోంది. 

ముందుగా విశాల్ తన 'అభిమన్యుడు' చిత్రాన్ని వాయిదా వేసి రిపబ్లిక్ డే నాడు విడుదల చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు అధికార ప్రకటన కూడా చేశారు. ఇటీవల విశాల్ నటించిన 'డిటెక్టివ్' సినిమా ప్రేక్షకాదరణ పొందడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పాడ్డాయి. ఈ సినిమాతో పాటు రవితేజ 'టచ్ చేసి చూడు' సినిమాను కూడా వాయిదా వేస్తున్నట్లు టాక్. ముందుగా సంక్రాంతికి రావాలనుకున్న చిత్రబృందం ఇప్పుడు మాత్రం వెనుకడుగు వేస్తోంది. విడుదల తేదీ విషయంలో పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎప్పుడు వస్తుందో చూడాలి. మొత్తానికి సంక్రాంతి బరి నుండి రెండు సినిమాలు బయటకు వచ్చేస్తున్నాయి. మరి మిగిలిన చిత్రాలు ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో చూడాలి!

loader