విశాల్‌పై ప్రేమ, పెళ్లి రూమర్స్ మరోసారి ఊపందుకున్నాయి. ఆయన ఓ పాపులర్‌ నటితో ప్రేమలో ఉన్నారని, త్వరలో మ్యారేజ్‌ చేసుకోబోతున్నారనే వార్త కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతుంది.

తమిళ హీరో విశాల్‌ మరోసారి ప్రేమలో పడ్డాడు. ఆయన ఓ నటితో కొద్ది రోజులుగా ప్రేమాయణం నడిపిస్తున్నారు. అంతేకాదు త్వరలోనే పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నారట. ప్రస్తుతం కోలీవుడ్‌ ఇది హాట్‌ టాపిక్‌గా మారింది. సోషల్‌ మీడియాలో ఈ వార్త వైరల్‌ అవుతుంది. ఇప్పటికే విశాల్‌ పెళ్లివరకు వెళ్లి క్యాన్సిల్‌ చేసుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌కి చెందిన ఓ అమ్మాయితో విశాల్‌ ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు. కానీ ఏమైందో ఏంటో తన ఎంగేజ్‌మెంట్‌ని క్యాన్సిల్‌ చేసుకున్నారు. 

ఆ తర్వాత నటి వరలక్ష్మి శరత్‌ కుమార్‌తో లవ్‌ లో ఉన్నట్టు ప్రచారం జరిగింది. వీరిద్దరు డేటింగ్‌ చేస్తున్నారని అటు కోలీవుడ్‌, ఇటు టాలీవుడ్‌లో వార్త వైరల్‌ అయ్యింది. కొన్నాళ్లకి ఆ వార్తలు కనుమరుగయ్యాయి. ఇప్పుడు నటి అభినయతో ప్రేమలో ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. నటిగా కీలక పాత్రల్లో నటిస్తున్న అభినయకి వినికిడి లోపం ఉన్న విషయం తెలిసిందే. మాటలు కూడా రావు(మూగ). 

అయినా హీరోలకు చెల్లిగా, అక్కగా, ఇతర కీలక పాత్రల్లో నటిస్తూ ఆకట్టుకుంటుంది. కొన్నిసార్లు హీరోలకు భార్య పాత్రలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఆమె విశాల్‌తో `మార్క్ ఆంటోని` చిత్రంలో ఆయనకు భార్యగా నటిస్తుంది అభినయ. దీంతో వీరిద్దరి మధ్య లవ్‌ ట్రాక్‌ నడుస్తుందనే ప్రచారం ఊపందుకుంది. దీంతో తాజాగా అభినయ స్పందించింది. ఈ వార్తలను ఆమె ఖండించారు. 

తాను ప్రస్తుతం విశాల్‌తో `మార్క్ ఆంటోనీ` చిత్రంలో ఆయనకు భార్యగా నటిస్తున్నానని, రీల్‌ లైఫ్‌లో భార్యగా నటిస్తే రియల్‌ లైఫ్‌లో వైఫ్‌గా మారుతారా? అంటూ ప్రశ్నించింది అభినయ. ఈ వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పింది. దీంతో విశాల్‌, అభినయ పెళ్లి రూమర్స్ కి చెక్‌ పెట్టినట్టయ్యింది. ఇక అభినయ తెలుగులో `నేనింతే`, `కింగ్‌`, `శంభో శివ శంభో`, `దమ్ము`, `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు`, `ధృవ`, `రాజుగారి గది 2`, ఇటీవల `సీతారామం` చిత్రాల్లో నటించి మెప్పించింది. 

మరోవైపు విశాల్‌ వరుసగా యాక్షన్‌ సినిమాలతో అలరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన `లాఠి` చిత్రంలో నటిస్తున్నారు. దీంతోపాటు `తుప్పరివాలన్‌ 2`, `మార్క్ ఆంటోని` చిత్రాలు చేస్తున్నారు. విశాల్‌కి తెలుగులోనూ మంచి మార్కెట్ ఉన్న విషయం తెలిసిందే. ఆయన ప్రతి సినిమా తెలుగులో రిలీజ్‌ చేస్తుంటారు. ఇక్కడ కూడా మంచి ఆదరణ పొందుతుంటారు. మరోవైపు విశాల్‌ దక్షిణ భారత నటీనటుల సంఘం కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.