తమిళ్ హీరో విశాలో వచ్చే ఏడు ఓ ఇంటి వాడు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఓ మీడియా సమావేశంలో మాట్లాడిన విశాల్ వచ్చేఏడు జనవరి లో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించాడు. అయితే ఇంతకీ విశాల్ పెళ్లి చేసుకునేది ఆ అమ్మాయేనా అని సినీ జనాలు గుసగుసలాడుతున్నారు. 

  తమిళ నడిగర్ సంఘం ఎన్నికల్లో హీరో విశాల్ ప్రత్యేర్దిని మట్టికరిపించి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల ప్రచారంలో నటుల సంఘం భవనాన్ని నిర్మిస్తామని హామీఇచ్చాడు. ఇచ్చిన  హామీని నిలబెట్టుకున్న విశాల్ తమిళ ఇండస్ట్రీకి చెందిన అతిరధ మహారథులతో  భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయించారు.   ఈ సందర్భంగా భవన నిర్మాణాన్ని అడ్డుకునేందుకు కుట్రపన్నుతున్నారని ఎట్టి పరిస్థితుల్లో ఈ భవన నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చాడు. నటుల సంఘం భవన నిర్మాణం పూర్తి అయితే నెలకు రూ.50లక్షల వరకు ఆదాయం వస్తుందని ఆ ఆదాయం తో ఆర్ధికంగా చితికిపోతున్న నటుల్ని ఆదుకుంటామని తెలిపారు. అంతేకాదు ఈ భవన నిర్మాణం పూర్తి అయ్యే వరకు పెళ్లి చేసుకోను. భవనం నిర్మాణం పూర్తి చేసిన తరువాత మొదటి శుభకార్యం నా పెళ్లే అవ్వాలని చెప్పుకొచ్చారు. 

అయితే ఈ భవన నిర్మాణ సమయంలో విశాల్ పెళ్లిపై నేషనల్ మీడియా ప్రశ్నించగా తాను ఇండస్ట్రీకి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నట్లు త్వరలో మిగిలిన వివరాల్ని ప్రకటిస్తానని అన్నాడు. ఈ వ్యాఖ్యలతో  కొద్దిరోజుల క్రితం విశాల్ పెళ్లిపై రకరకాల రూమర్స్ హల్ చల్ చేశాయి. తమిళ సీనియర్ హీరో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి - హీరో విశాల్ గత కొంతకాలంగా ప్రేమించినట్లు కోలీవుడ్ లో జోరుగా ప్రచారం సాగింది. చివరకు ఈ విషయం పెద్దలకు తెలిసింది. ఐతే  శరత్ కుమార్ కు ఈ పెళ్లి ఇష్టం లేదని అప్పట్లో పుకార్లు చేశాయి. చివరకు శరత్ కుమార్ భార్య రాధిక దగ్గరుండి మరీ ఈ పెళ్ళికి మధ్యవర్తిగా  ఉన్నట్లు సమాచారం. 

అందుకు ఊతం ఇచ్చేలా విశాల్ చెన్నై విమానాశ్రయంలో మాట్లాడుతూ నటీనటుల సంఘం భవన నిర్మాణం వేగంగా సాగుతుందని సంఘం సొంత భవనంలో జరగనున్న మొదటి వివాహం తనదే అవుతుందని అందుకు మండపానికి అడ్వాన్స్ చెల్లించి బుక్ చేసుకున్నట్లు విశాల్ పేర్కొన్నాడు. 

ఈ సందర్భంగా తమిళ ఇండస్ట్రీ క్యూబ్ - జీఎస్టీ లాంటి సమస్యలపై మార్చి ఒకటి నుంచి సమ్మెకు పిలుపునిచ్చింది. ఆ సమ్మెతో సినిమాల విడుదల ను వాయిదా వేస్తామని అన్నారు. క్యూబ్ సంస్థతో చర్చలు జరిపామని అవి సఫలం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశాడు.  తమిళ భాషకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసేలా  అమెరికలోని హార్వర్డ్ యూనివర్సిటీతో చర్చిందేకు  అందుకు కావాల్సిన నిధులపై నటీనటుల సంఘం  

మొత్తానికి హీరో విశాల్ పెళ్లి మరోసారి తెరపైకి వచ్చింది. దీంతో విశాల్ చేసుకునేది శరత్ కుమార్ కూతురు వరలక్ష్మీయేనా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.