వరుస విజయాలతో అటు తమిళ్ లో ఇటు తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకుంటున్న విశాల్ అదే సక్సెస్ ను కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం చేయాల్సిన ప్రాజెక్టులు చాలా ఉన్నా కూడా విశాల్ ఒక తెలుగు కథను రీమేక్ చెయ్యాలని అనుకుంటున్నాడు. ఎన్టీఆర్ కెరీర్ లో ది బెస్ట్ గా నిలిచిన టెంపర్ సినిమా ను రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. 

అసలు విషయంలోకి వస్తే.. తన ప్రతి సినిమాను తెలుగులో  డబ్ చేసే విశాల్ టెంపర్ రీమేక్ ను కూడా తెలుగు ప్రేక్షకులకు చూపించాలని అనుకుంటున్నాడు. ఆ సినిమాలో తారక్ ఆ చేసిన నటనను ఎవరు మర్చిపోలేరు. ముఖ్యంగా కోర్టు సీన్ అందులో హైలెట్ గా నిలిచింది. అయితే ఆ స్థాయిలో విశాల్ అభిమానుల అంచనాలను అందుకోగలడా అనేది చర్చనీయాశంగా మారింది. 

రీసెంట్ గా విశాల్ టెంపర్ రీమేక్ ను తెలుగులో కూడా విడుదల చేయడానికి ఒక కారణాన్ని తెలిపాడు. ఎన్టీఆర్ నటనకు ఏ మాత్రం మ్యాచ్ అవ్వకుండా తన స్టైల్ లో డిఫరెంట్ గా ప్రజెంట్ చేసేందుకు ప్రయత్నం చేస్తానని అందుకే తెలుగులో సినిమాను డబ్ చేయనున్నట్లు వివరించాడు. ఇక సినిమాకు అయోగ్య అని తమిళ్ టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలిపారు.