2019 లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సందర్భంలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. కొద్దిసేపటి క్రితమే కౌంటింగ్ మొదలైంది. విశాఖ లోక్ సభ స్థానానికి సంబంధించి కౌంటింగ్ లో సినీ నిర్మాత ఎం.వి.వి.సత్యనారాయణ ముందంజలో ఉన్నారు.

ఎన్నికల సంఘం అధికారిక వెబ్ సైట్ లో పొందుపరిచిన ఫలితాల ప్రకారం.. ఇప్పటివరకు సత్యనారాయణకు 14284 ఓట్లు పోలయ్యాయి. బాలకృష్ణ చిన్నల్లుడు టీడీపీ అభ్యర్ధి భరత్ 12585 ఓట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. మూడో స్థానంలో జేడీ లక్ష్మీనారాయణ 13241 ఓట్లతో ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 25 లోకసభ స్థానాలకు ఏప్రిల్ 11వ తేదీన పోలింగ్ జరిగింది. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెసు, జనసేన ప్రధానంగా పోటీలో ఉన్నాయి. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం జరుగుతోంది.