దాదాపు మూడేళ్లు అవుతుంది విరాటపర్వం మూవీ స్టార్ట్ అయ్యి.. సినిమా కంప్లీట్ అయినా రిలీజ్ కు నోచుకోవడం లేదు రానా సినిమా. థియేటర్లలో సినిమా రిలీజ్ చేసే ఛాన్స్ దొరక్కపోవడంతో..ఓటీటీవైపు చూస్తున్నట్టు తెలుస్తోంది.
స్టార్ హీరో రానా, నేచురల్ బ్యూటీ సాయిపల్లవి జంటగా నటించిన మూవీ విరాటపర్వం. వేణు ఊడుగుల డైరెక్ట్ చేసిన ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యి చలా కాలం అవుతుంది. లాస్ట్ ఇయర్ ఏప్రిల్‌లోనే ఈసినిమా రిలీజ్ చేయాలి అనుకున్నప్పటికీ కరోనా వల్ల వాయిదా పడుతూ వచ్చింది మూవీ. ఇక కరోనా టైమ్ అయిపోతుండటంతో..అన్నీ పెద్ద సినిమాలు రిలీజ్ కు పోటీ పడుతుతున్నాయి. ఇక ఈ టైమ్ లో విరాటపర్వం రిలీజ్ ఎప్పుడంటూ.. ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈక్రమలోన థియేటర్లలోకి వచ్చేదెప్పుడన్న ప్రశ్న ఎదురవుతోంది.
విరాటపర్వం సినిమా ఇప్పట్లో థియేటర్లలో రిలీజ్ అయయ్యేలా కనిపించడం లేదు. ఇప్పటికే ఈ సినిమా స్టార్ట్ అయ్యి మూడేళ్లు దాటిపోయింది.రిలీజ్ కోసం రేండేళ్లకు పైగా మూవీ టీమ్ ఎదురు చూస్తూనే ఉంది. ఇప్పటికే పెద్ద సినిమాలన్నీ రిలీజ్ డేట్లు ఫిక్స్ చేసుకున్నాయి. వాటి మధ్య రిలీజ్ చేసి... ఇబ్బంది పడటం ఎందుకు అని ఆలోచిస్తున్నారు విరాటపర్వం మేకర్స్. అందుకే ఇప్పట్లో వీరాటపర్వంరిలీజ్ ఉండదనే తెలుస్తోంది.
అందులోను ఈ మూవీని థియేటర్ లో కాకుండా ఓటీటీలో రిలీజ్ చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అసలు సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్ లేకపోవడంతో విరాటపర్వం ఓటీటీలోకి రాబోతుందంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ మేరకు ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నిర్మాతలకు దాదాపు 50 కోట్లు ఆఫర్ చేసిందని తెలుస్తోంది.
41 కోట్లు డిజిటల్ రిలీజ్ కోసం, 9 కోట్లు శాటిలైట్ హక్కుల కోసం అందజేస్తామని సదరు ఓటీటీ సంస్థ ముందుకొచ్చినట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. గతంలోనూ ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కానుందంటూ ఊహాగానాలు వెలువడగా అవన్నీ వట్టి పుకార్లుగా కొట్టిపారేశాడు డైరెక్టర్. మరి ఈ ఓటీటీ డీల్‌పై దర్శకుడు ఏమని స్పందిస్తాడో చూడాలి
2019 జూన్ లో షూటింగ్ స్టార్ట్ చేసుకుని...అప్పటి నుంచి నాన్ స్టాప్ గా షూటింగ్ చేసుకోవాలి అనకున్నారు. కాని కొన్ని రోజులు రానా అందుబాటులో లేకపోవడం. ఆ తరువాత కరోనా పరిస్థితులు సినిమాకు శాపంగా మారాయి. ఇలా మూడేళ్లు గడిచిపోయాయి. సుధాకర్ చేకూరితో కలిసి సురేష్ బాబు నిర్మించిన ఈసినిమాలో రానా- సాయిపల్లవితో పాటు ప్రియమణి, నందితా దాస్, నివేదా పేతురాజ్ నవీన్ చంద్ర, ఈశ్వరీ రావ్ లాంటి స్టార్ కాస్ట్ నటించారు. సురేష్ బొబ్బిలి విరాటపర్వానికి మ్యూజిక్ అందించారు.