ఓ వైపు ఐపీఎల్‌ క్రికెట్‌ లో భాగంగా గ్రౌండ్‌లో పరుగులతో రెచ్చిపోతున్న విరాట్‌ కొహ్లీ.. మరోవైపు రొమాన్స్ లోనూ ఏమాత్రం తగ్గడం లేదు. తన భార్య, హీరోయిన్‌ అనుష్క శర్మతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. 

తాజాగా కొహ్లీ, అనుష్కలు సముద్రంలో దగ్గరగా ఒకరికొకరు చూసుకుంటూ రెచ్చిపోయారు. సాయంత్రం వేళ ఇలా ఘాటు రొమాన్స్ దిగడంతో అది చూసి ఆగలేని సౌత్‌ ఆఫ్రికన్‌ క్రికెటర్‌ ఏబీ డి విలియర్స్ టక్‌ మని ఓ ఫోటో క్లిక్‌మనిపించాడు. ఆ ఫోటోని తాజాగా కొహ్లీ తన సోషల్‌ మీడియా అకౌంట్ల ద్వారా ఆదివారం రాత్రి అభిమానులతో పంచుకున్నారు. 

వెనకాల పెద్ద కోట కనిపిస్తుండగా, నీటిలో కొహ్లీ, అనుష్క స్విమ్మింగ్‌ చేస్తూ ఒకరినొకరు చూసుకుంటున్న ఈ ఫోటోకి విశేష స్పందన లభిస్తుంది. నెటిజన్లు, కొహ్లీ,అనుష్క ల అభిమానులు అభినందనలతో  కూడిన కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం కొహ్లీ ఐపీఎల్‌ నిమిత్తం దుబాయ్‌లో ఉన్నారు. కొహ్లీతోపాటు అనుష్క శర్మ కూడా దుబాయ్‌లోనే ఉంది. దీంతో మ్యాచ్‌ లేని రోజు విరాట్‌ కొహ్లీ ఇలా ఫ్యామిలీ కలిసి ఎంజాయ్‌ చేస్తున్నారు.

View this post on Instagram

❤️🌅 pic credit - @abdevilliers17 😃

A post shared by Virat Kohli (@virat.kohli) on Oct 18, 2020 at 7:50am PDT

ఇదిలా ఉంటే ప్రస్తుతం అనుష్క శర్మ ప్రెగ్నెంట్‌. వచ్చే ఏడాది జనవరిలో వీరిద్దరు తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్ని ఆగస్ట్ నెలలో కొహ్లీ ప్రకటించిన విషయం తెలిసిందే.