టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ మైదానంలో ప్రవర్తించే తీరు కొందరికి నచ్చుతుంది. మరికొందరికి నచ్చదు. ఆయన దూకుడు ప్రవర్తనని విమర్శించే వారు ఉన్నారు అలానే పొగిడేవారు కూడా ఉన్నారు.

ఎన్ని కామెంట్స్ వచ్చినా.. కొహ్లీ మాత్రం తన ప్రవర్తన మార్చుకోడు. ఇప్పటికీ తన దూకుడుని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఈ విషయంపై బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా స్పందించాడు. కొహ్లీ తీరుని తప్పుబడుతూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

ఆయన మాట్లాడుతూ.. ''కొహ్లీ ప్రపంచంలో అత్యత్తమ బ్యాట్స్ మెన్ మాత్రమే కాదు.. ప్రపంచ క్రికెట్ లో అత్యంత చెత్త ప్రవర్తన కూడా అతడిదే.. అతడి క్రికెట్ నైపుణ్యం.. అతడికున్న అహంకారం, చేదు ప్రవర్తన కారణంగా మసక బారుతోంది.

ఇప్పుడు నేను విరాట్ ని కామెంట్ చేసినందుకు ఇండియా వదిలి వెళ్లడం లేదని'' మరో సెటైర్ వేశాడు. గతంలో ఓ అభిమాని కోహ్లి కంటే ఆస్ట్రేలియా క్రికెటర్లంటేనే  ఎక్కువ ఇష్టమని అంటే దానికి కోహ్లి మరి ఇండియాలో ఎందుకు ఉన్నావని అడిగాడు. ఇప్పుడు ఆ విషయాన్ని గుర్తు చేస్తూ నసీరుద్దీన్ సెటైర్ పేల్చాడు.