టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. శ్రీలంకతో జరుగనున్న టీ20 సిరీస్ కు విశ్రాంతి తీసుకున్న కోహ్లీ ఇంట్లో ఉంటున్నాడు. అనుష్క షూటింగ్స్ తో బిజీగా ఉంటోంది. తదుపరి సినిమా షూటింగ్ లో బిజీగా పాల్గొంటున్న అనుష్క భోపాల్ నుంచి ముంబై చేరుకుంది. భార్యను తీసుకొచ్చేందుకు స్వయంగా విరాట్ ఎయిర్ పోర్టుకి వెళ్లాడు. కారు ఎక్కిన అనుష్కను విరాట్ ప్రేమగా గుండెలకు హత్తుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముంబై చేరుకున్న భార్యను తీసుకుని బోనీ కపూర్ కుటుంబాన్ని కలిసేందుకు వెళ్లిన సంగతి తెలిసిందే.