విరాట్ అనుష్క ల రిసెప్షన్ ఇన్విటేషన్ లో ఇలాంటి సర్ ప్రైజ్ ఊహించలేరు

virat kohli anushka reception invitation with a surprise
Highlights

  • విరాట్ అనుష్కల పెళ్లి రిసెప్షన్ కు భారీ ఏర్పాట్లు
  • బంధువులకోసారి, క్రికెటర్లు సెలెబ్రిటీలకోసారి రిసెప్షన్ విందు
  • విందు ఆహ్వానాల్లో ప్రత్యేకతను చాటుకున్న విరాట్ అనుష్క జంట

ఇటలీలో డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకున్న కోహ్లీ-అనుష్క దంపతులు తమ రిసెప్షన్ కోసం ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. తమ వివాహ రిసెప్షన్ కోసం అతిథులకు ఆహ్వానాలు పంపడంలో విరుష్క తమదైన ప్రత్యేకత చాటుతున్నారు. ప్రస్థుతం వివాహ బంధంతో ఒక్కటైన విరాట్‌- అనుష్క జంట రిసెప్షన్‌కు ఆహ్వానాలు పంపే పనిలో ఉంది. అయితే, అందరిలా వేల రూపాయలు విలువచేసే బహుమతులు పంపితే అది విరుష్క జంట ఎందుకు అవుతుంది? అందుకే బహుమతులు కొత్తగా ఉండాలనుకున్నారు. అందుకు తగ్గట్టే రిసెప్షన్‌ ఆహ్వాన పత్రికతో పాటు ఒక మొక్కను కూడా బహుమతిగా అందిస్తున్నారు.

 

ఇన్విటేషన్ కూడా పర్యావరణానికి ఏమాత్రం హాని చేయని పేపర్‌ బ్యాగ్‌లో పెట్టి పంపిస్తున్నారు. ఆ ఆహ్వానాన్ని అందుుకున్నవాళ్లు వాటిని చూసి ప్రకృతి పట్ల ఈ కొత్త జంట కనబరుస్తున్న ప్రేమను కొనియాడుతూ మనసులు గెలిచారంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

 

మరోవైపు ఇటీవలే ఇటలీలో ఒక్కటైన ఈ ప్రేమజంట విందు ఏర్పాట్లు చేయటంలో బిజీగా ఉంది. కుటుంబ సభ్యుల కోసం ఈ నెల 21న దిల్లీలోనూ, బాలీవుడ్‌- క్రికెట్‌ ప్రముఖల కోసం ఈ నెల 26న విందు వేర్వేరుగా విందు ఇవ్వనున్నారు. ఇంతకీ ఈ మొక్క ఐడియా ఎవరిదో మరి!. ఇద్దరూ ప్రకృతిపై తమ ప్రేమను ఇలా చాటుకోవటం పట్ల వాళ్ల అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

loader