మంచు విష్ణు, విరోనికా దంపతులకు ఇటీవల కుమార్తె జన్మించిన విషయం తెలిసిందే.కాగా మంచు విష్ణు దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కొడుకు ఉన్నారు. తాజాగా తన భార్య నాలుగో బిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని విష్ణు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.

ఇక విష్ణు తన చిన్న కుమార్తెకు పేరు పెట్టాడు. తన కుమర్తె పేరు 'ఆర్య విద్య మంచు' అని మంచు విష్ణు ట్వీట్ చేశాడు. పేరు చాలా బావుందంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ఇది ఇలా ఉండగా.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మంచు విష్ణు భార్య విరానికా తాజాగా తమ నలుగురు పిల్లలు కలిసి తీసుకున్న ఫోటోలను పోస్ట్ చేశారు.

ఈ ఫోతోలు చాలా క్యూట్ గా ఉండడంతో అభిమానులు 'మీ పిల్లలు చాలా అందంగా ఉన్నారంటూ' కామెంట్స్ పెడుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. మంచు విష్ణు కొద్దిరోజుల క్రితం 'ఓటర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.